విధాత: కేంద్ర మంత్రి బండి సంజయ్ పై అసభ్యకర వార్తలతో విమర్శలు చేస్తున్న యూ ట్యూబర్ దారమోని గిరీష్ పై బీజేపీ మహిళా కార్యకర్తలు దాడి చేయడం చర్చనీయాంశమైంది. ద చిత్రగుప్త్ పేరుతో హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో దారమోని గిరీష్ యూ ట్యూబ్ చానల్ నడుపుతు జర్నలిస్టు ముసుగులో బ్లాక్ మెయిల్ దందాలు సాగిస్తున్నాడని ఆరోపిస్తూ బీజేపీ మహిళా కార్యకర్తలు అతని ఇంటిపై దాడి చేశారు. బట్టలు ఊడదీసి కొట్టి, చెప్పులు మెడకు వేసి పోలీసుల ముందే ఉరికించారు.
ఇద్దరు బీజేపీ నాయకుల ప్రోద్బలంతో కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా అసత్య ప్రచారానికి తెర తీసి మహిళా కార్యకర్తతో లేని సంబంధం అంటగట్టాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించడానికి వెళ్లిన మహిళా కార్యకర్తలపై గిరీష్ అసహ్యకరమైన వ్యాఖ్యలతో దూషిస్తూ మిరప కారం పొడితో దాడికి పాల్పడ్డాడని.. దాంతో ఆగ్రహించిన మహిళా కార్యకర్తలు గిరీష్ కు దేహశుద్ధి చేశారని సమాచారం. గిరీష్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని లేకపోతే మరోసారి దాడి చేస్తామని, నగర వీధుల్లో ఊరేగిస్తామని బీజేపీ మహిళా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా హెచ్చరించారు.