ప్రశాంతంగా ముగిసిన యుపిఎస్ సి పరీక్షలు

పరీక్షలకు హాజరైన 638 మంది అభ్యర్థులువిధాత:యుపిఎస్ సి ఆధ్వర్యంలో ఆదివారం ఎంప్లాయిస్ ప్రావీడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్స్, అకౌంట్ ఆఫీసర్లు ఉద్యోగ నియకమాలకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని విజయవాడ సబ్ కలెక్టర్ జి. ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ తెలిపారు.ఆదివారం కృష్ణావేణి స్కూల్, మెరిస్ స్టెల్లా కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు.తొలుత పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ను స్ట్రాంగ్ రూమ్ నుంచి పరీక్ష కేంద్రాలకు పంపే ఏర్పాట్లను […]

  • Publish Date - September 5, 2021 / 11:24 AM IST

పరీక్షలకు హాజరైన 638 మంది అభ్యర్థులు
విధాత:యుపిఎస్ సి ఆధ్వర్యంలో ఆదివారం ఎంప్లాయిస్ ప్రావీడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్స్, అకౌంట్ ఆఫీసర్లు ఉద్యోగ నియకమాలకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని విజయవాడ సబ్ కలెక్టర్ జి. ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ తెలిపారు.ఆదివారం కృష్ణావేణి స్కూల్, మెరిస్ స్టెల్లా కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు.తొలుత పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ను స్ట్రాంగ్ రూమ్ నుంచి పరీక్ష కేంద్రాలకు పంపే ఏర్పాట్లను డియర్ ఓ యం. వెంకటేశ్వర్లు,ఏవో వి.శ్రీనివాస్ తో కలిసి పర్యవేక్షిం చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1608 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాల్సిఉండగా నగరంలో ఏర్పాటు చేసిన 4 పరీక్ష కేంద్రాల్లో 638 (39.67 శాతం)మంది హాజరయ్యారన్నారు.