మత్స్యకారులకు విశాఖ తుఫాన్ కేంద్రం హెచ్చరిక
విధాత:తూర్పు, ఈశాన్య బంగాళాఖాతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది.దీని ప్రభావంతో శుక్రవారం వాయవ్య బంగాళాఖాతం పరసరాల్లో అల్పపీడనం ఏర్పడనున్నది.తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారనుంది.పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ, ఒడిసా మీదుగా పయనిస్తుంది.రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో ఈ నెల 14 వరకు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు.దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు […]

విధాత:తూర్పు, ఈశాన్య బంగాళాఖాతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది.దీని ప్రభావంతో శుక్రవారం వాయవ్య బంగాళాఖాతం పరసరాల్లో అల్పపీడనం ఏర్పడనున్నది.తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారనుంది.పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ, ఒడిసా మీదుగా పయనిస్తుంది.రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో ఈ నెల 14 వరకు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు.దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
నాలుగురోజుల పాటు కోస్తా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ కేంద్రం హెచ్చరిక