Ys Jagan: డీలిమిటేషన్పై.. ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ!

  • By: sr |    news |    Published on : Mar 22, 2025 4:14 PM IST
Ys Jagan: డీలిమిటేషన్పై.. ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ!

Delimitation | Ys Jagan | Modi

విధాత : డీలిమిటేషన్ పై ఓ వైపు తమిళనాడులో సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరుగుతున్న సమయంలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ సమస్యపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని జగన తన లేఖలో ప్రధానిని కోరారు. 2026లో జరిగే డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఉందని..ఎంపీ సీట్లు తగ్గుతాయని దక్షిణాదిలో చర్చ జరుగుతుందని జగన్ లేఖలో పేర్కొన్నారు.

గత 15 ఏళ్లలో దక్షిణాదిలో జనాభా తగ్గిందని… గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఇక్కడ ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ఆందోళన సర్వత్రా నెలకొందన్నారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా చూడాలని వైఎస్ జగన్ కోరారు.

కాగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ చైన్నైలో నిర్వహించిన అఖిల పక్ష భేటీకి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకాలేదు. డీలిమిటేషన్ తో సీట్లు తగ్గవన్న కేంద్రం వాదనను విశ్వసిస్తూ ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నుంచి కూడా చైన్నై భేటీకి ఎవరు వెళ్లనప్పటికి జగన్ ప్రధాని మోడీకి డీలిమిటేషన్ పై లేఖ రాయడం గమనార్హం.