Poonam Kaur | పవనా.. త్రివిక్రమా.. ముందు క్లారిటీ ఇవ్వు తల్లీ!

Poonam Kaur | ఒక్కోసారి హీరోయిన్లు ఏం చెప్పాలనుకుంటున్నారో నిజంగా అర్థం కాదు. అసలు వాళ్ళు చేసే కామెంట్స్ ఎందుకు చేస్తున్నారో, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నవో తెలీకుండా కాస్త చెప్పీ, చెప్పనట్టు చేసే ట్వీట్స్ అర్థమయ్యి, అవనట్లుగా మారి నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకునే పేరు మాత్రం పూనమ్ కౌర్‌దే. చక్కని నటి అని అనిపించుకోకపోయినా కాస్తో కూస్తో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ ట్రోల్ అవుతూ ఉండే నటి పూనమ్ […]

  • Publish Date - July 14, 2023 / 10:31 AM IST

Poonam Kaur |

ఒక్కోసారి హీరోయిన్లు ఏం చెప్పాలనుకుంటున్నారో నిజంగా అర్థం కాదు. అసలు వాళ్ళు చేసే కామెంట్స్ ఎందుకు చేస్తున్నారో, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నవో తెలీకుండా కాస్త చెప్పీ, చెప్పనట్టు చేసే ట్వీట్స్ అర్థమయ్యి, అవనట్లుగా మారి నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకునే పేరు మాత్రం పూనమ్ కౌర్‌దే.

చక్కని నటి అని అనిపించుకోకపోయినా కాస్తో కూస్తో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ ట్రోల్ అవుతూ ఉండే నటి పూనమ్ కౌర్. తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా చేయకపోయినా అమ్మడు వేసే కౌంటర్స్‌తో కాస్త జనాల నోళ్ళల్లో నానుతుంది.. కానీ నటన పరంగా ఎప్పుడో షెడ్డుకి వెళ్లిపోయిందీ అమ్మడు.

ఆ మధ్యకాలంలో గవర్నర్ తమిళిసై ముందు కంటతడి పెట్టుకుని మరీ తనని పంజాబీ అని టాలీవుడ్ వెలివేస్తుందని, తను తెలంగాణలోనే పుట్టి పెరిగానని అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున బోరుమంది పూనమ్. ఆ కామెంట్స్ కాస్త అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా అమ్మడు గురుపౌర్ణమి నాడు మరో ట్వీట్ చేసి నెట్టింట వైరల్ అయింది.

గురుపౌర్ణమి రోజున బండ్ల గణేష్ పవన్‌ని ఉద్దేశించి గురువు అంటూ ఓ ట్వీట్ వేశాడు. వాస్తవానికి ఇండస్ట్రీలో గురూజీగా పేరుంది త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి. పూనమ్ కౌర్ ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్ చేసేది త్రివిక్రమ్‌నే అయినా.. అంతా పవన్ కల్యాణ్‌ని అనుకుంటూ.. ఆమె చేసే ట్వీట్స్‌ని తెగ వైరల్ చేస్తుంటారు.

‘‘మీ అందరినీ కోరేది ఒకటే.. టామ్, డిక్ అండ్ హారీ అని ప్రతి ఒక్కరినీ గురువు అని పిలవకండి’’ అని అర్థం వచ్చేట్టుగా.. ‘‘దారిచూపించేవాడు గురువు అవుతారు తప్పితే.. స్టేజ్ మీద నీతులు చెప్పి, జీవితాలతో ఆడుకునే వారు గురువు కాదని’’ పెద్ద మాటలే వాడింది. ఈ ట్వీట్ పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు కానీ.. ఇందులోనూ పూనమ్.. గురూజీనే టార్గెట్ చేసిందనేది నిగూఢంగా అర్థమవుతోంది.

అందుకే ఆమె పోస్ట్ చేసినా కొన్ని రోజుల తర్వాత కూడా.. ఆమె ట్వీట్ నెట్టింట వైరల్ అయి తిరుగుతోంది. ఈ పోస్ట్‌తోనే మొదలు కాదు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ పైనా ఇలాంటి కామెంట్సే గతంలోనూ చేసింది పూనమ్. ఇంత లోతుగా పోస్ట్ పెట్టడానికి వెనుక ఏం ఉద్దేశ్యం ఉండి ఉంటుందా అనే చర్చ నడుస్తుంది.

ఏదైనా ఇబ్బందులు ఉంటే సరిచేసుకోవాల్సింది పోయి ఇలా పోస్ట్‌లు పెట్టి, రీ ట్వీట్స్ చేసి సాధించేదేముంటుంది. ట్రోల్ కావడం తప్పితే.. ఈ హీరోయిన్స్‌కి ఆనందం వచ్చినా, బాధ కలిగినా పిచ్చోడి చేతిలో రాయిలా ఈ సోషల్ మీడియా ఒకటి దొరికిందని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు..

Latest News