• Telugu News
  • /Politics

కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్

కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనుండగా, కొత్త కేబినెట్‌పై ఆసక్తి నెలకొంది.

Reported by: Tejaswini Nanna | రాజకీయాలు | May 30, 2026, 5:48 pm IST
Read Time: 2 mins
కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్

కర్ణాటకలో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్‌ను ఎన్నుకున్నారు. సీఎల్పీ సమావేశంలో ఆయన పేరును మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. జూన్‌ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

డీకే శివకుమార్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు కేసీ వేణుగోపాల్‌ కూడా ప్రకటించారు. అంతకుముందు డీకే శివకుమార్ గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్‌ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించారు. డీకే శివకుమార్ ఏర్పాటు చేయబోయే కొత్త మంత్రి వర్గంలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు చోటుదక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునికేబినెట్ లో యువ నాయకత్వానికి ఎక్కువ అవకాశాలు ఇవ్వనున్నట్లుగా సమాచారం. సామాజిక సమీకరణలు, పాత కొత్త కలయికలతో మంత్రివర్గ కూర్పు ఉండనుందని, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండవచ్చని తెలుస్తోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.