రుణమాఫీపై కిసాన్ కాంగ్రెస్‌కే సంబరాలు, ఏక కాల రుణమాఫీ కాంగ్రెస్‌ సాధ్యం … కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న 31వేల కోట్లతో ఏక కాలంలో చేయనున్న 2లక్షల రైతు రుణమాఫీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం గాంధీ భవన్‌లో సంబరాలు జరుపుకున్నారు

  • Publish Date - June 22, 2024 / 05:55 PM IST

విధాత : సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న 31వేల కోట్లతో ఏక కాలంలో చేయనున్న 2లక్షల రైతు రుణమాఫీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం గాంధీ భవన్‌లో సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి, స్వీట్స్ పంచి సంబరాలు చేసుకున్న కిసాన్ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో చేసిన మొదటి హామీ ప్రతి రైతుకు 2లక్షల రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 2014 కంటే ముందు రాష్ట్ర అప్పు 72,658 కోట్లు అని, బీఆరెస్‌ అధికారంలోకి వచ్చాక 6,71,751,కోట్లకు చేరాయని, కేసీఆర్ కుటుంబానికి దోచుకుకోవడమే తప్పా అభివృద్ధి పై దృష్టి లేదన్నారు.

ఎన్నికల్లో అందరి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ సమగ్ర మ్యానిఫెస్టో రూపొందించి వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చామన్నారు. ఇందిరాగాంధీ హయం నుంచి కాంగ్రెస్ రైతులకు ప్రాధాన్యం ఇస్తుందని, రైతు సంక్షేమం, ఏకకాల రుణమాఫీ కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. గతంలో యూపీఏ వైఎస్సార్ హాయంలో కూడా రైతు రుణమాఫీ చేశామన్నారు. కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫీపై చారిత్రాక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఏక కాలంలో రుణమాఫీ అనేది కేవలం కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదని, రాష్ట్ర రైతాంగం కాంగ్రెస్‌క అండగా ఉండాలన్నారు. బీఆరెస్‌ లక్ష రుణమాఫీ ఆరు సార్లు చేసి, కేవలం 11,930 కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతుందని, రైతు రుణమాఫీ హామీ అమలుతో హరీష్ రావు రాజీనామా చేయబోతుండని, స్పీకర్ పార్మేట్లో రాజీనామా సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Latest News