Meta AI in WhatsApp | వాట్సాప్‌లోకి AI రంగప్రవేశం.. ఎలా వాడాలో తెలుసా..?
Meta AI in WhatsApp | ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) హవా నడుస్తోంది. భవిష్యత్తు అంతా ఏఐ మీద ఆధారపడి నడవనుండడంతో ప్రముఖ కంపెనీలన్నీ ఏఐపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే యాపిల్ ఐఓఎస్ 18లో ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చారు. పలు స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు కూడా తమ ఫోన్లలో ఏఐ ఫీచర్‌ని ఇన్‌బిల్ట్ చేశాయి. యాపిల్ ఐఓఎస్ 18లో జెన్మోజీ అనే ఫీచర్‌ని పరిచయం చేశారు. ఈ ఫీచర్‌తో యూజర్స్.. టెక్స్ట్ ఇన్‌పుట్ ఇచ్చి ఇమేజ్‌లను జనరేట్ చేసుకోవచ్చు.
Meta AI in WhatsApp : ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) హవా నడుస్తోంది. భవిష్యత్తు అంతా ఏఐ మీద ఆధారపడి నడవనుండడంతో ప్రముఖ కంపెనీలన్నీ ఏఐపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే యాపిల్ ఐఓఎస్ 18లో ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చారు. పలు స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు కూడా తమ ఫోన్లలో ఏఐ ఫీచర్‌ని ఇన్‌బిల్ట్ చేశాయి. యాపిల్ ఐఓఎస్ 18లో జెన్మోజీ అనే ఫీచర్‌ని పరిచయం చేశారు. ఈ ఫీచర్‌తో యూజర్స్.. టెక్స్ట్ ఇన్‌పుట్ ఇచ్చి ఇమేజ్‌లను జనరేట్ చేసుకోవచ్చు.
తాజాగా వాట్సాప్ కూడా ఇలాంటి ఫీచర్‌నే తీసుకొచ్చింది. వాట్సాప్‌లో ఏఐ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది మెటా. యూజర్స్ అభిరుచికి తగ్గట్టు అనేక మార్పులు చేస్తూ సరికొత్త ఫీచర్స్‌ని అందిస్తున్న మెటా తాజాగా వాట్సాప్ వినియోగదారుల కోసం ఏఐ చాట్ బాట్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చాట్ బాట్‌ని ఉపయోగించి ఏ సమాచారాన్ని అయినా పొందవచ్చు. మీరు ఏదైనా సమాచారం కోసం వెతకాలి అనుకుంటే గూగుల్ తల్లిని అడగాల్సిన పనిలేదు.
జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసి అడిగితే చాలు. ఉదాహరణకు ఇప్పటి వరకు కల్కి కలెక్షన్స్ ఎంత వరకు వచ్చాయి అని అడిగితే సమాచారం ఇస్తుంది. అలానే ఆ కలెక్షన్స్‌కి సంబంధించిన వెబ్‌సైట్ లింకులని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్ లానే పనిచేస్తుంది. అయితే సినిమా పోస్టర్లు, హీరోయిన్ల పిక్స్‌ను అడిగితే.. సారీ అలా అడగడం తప్పు కదా అని అంటుంది. ప్రస్తుతం అయితే ఇంగ్లిష్‌లో అడిగితే కరెక్ట్ సమాచారాన్ని ఇస్తుంది. తెలుగులో అడిగితే తడబడుతుంది. ఇంకా ఇది డెవలపింగ్ స్టేజ్‌లో ఉంది.
వాట్సాప్ వెబ్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ మెటా ఏఐ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ కనిపించకపోతే కనుక మీ వాట్సాప్ యాప్‌ని అప్డేట్ చేసుకోవాలి. వాట్సాప్ వెబ్‌లో పైభాగంలో చాట్స్‌కు కుడివైపున నీలం, పింక్ రంగుల్లో చిన్న సైజు గుండ్రని వృత్తం కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ప్రత్యేకంగా ఒక చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏ సమాచారాన్ని అయినా అడగవచ్చు. టెక్స్ట్ కంటెంట్‌కు సంబంధించిన ఇన్‌పుట్ ఇస్తే.. టెక్స్ట్ అవుట్ పుట్స్ ఇస్తుంది. అలానే ఏదైనా మ్యాజికల్ ఇమేజ్‌లు కావాలన్నా ఇస్తుంది.
ఉదాహరణకు మీకు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బస్సు వెళ్తున్న ఫోటో కావాలి అని ఇంగ్లిష్‌లో అడిగితే ఆ ఇమేజ్‌ని ఇస్తుంది. మీ ఊహల్లో ఏది ఉంటే దానికి తగ్గట్టు కరెక్ట్ ఇన్‌పుట్స్ ఇస్తే మీకు కావాల్సిన ఇమేజ్‌ని ఇస్తుంది. అయితే మెటా ఏఐకి సాధ్యమయ్యే చిత్రాలను మాత్రమే జనరేట్ చేస్తుంది. అయితే వాట్సాప్‌లో ఈ ఏఐ చాట్‌బాట్‌ను ఎలా వాడాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి చాట్‌లోకి వెళ్ళాలి. చాట్ ట్యాట్‌లో ఏఐ ఐకాన్ కనిపిస్తుంది. సర్వీస్ టర్మ్స్‌ను చదివి యాక్సెప్ట్ చేయాలి. ప్రాంప్టుని సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ టైప్ చేయాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram