SNAKE Watch: 24 గంటలు పాముతోనే.. మీరెప్పుడైనా చూశారా!

  • By: sr    videos    Apr 12, 2025 10:25 AM IST
SNAKE Watch: 24 గంటలు పాముతోనే.. మీరెప్పుడైనా చూశారా!

Zbioland SNAKE Watch:

విధాత: పామును చూస్తేనే మనిషికి ఒళ్లు జలధరిస్తుంది. పాములంటే భయంతో మనం ఏదో చూశామా వెళ్లమా అన్నట్లుగా వాటికి దూరంగా ఉంటాం. కాని ఓ మనిషి 24గంటలు పాముతోనే ఉండాలనుకున్నాడు. ఏకంగా దానిని చేతికి ధరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కానీ ఇక్కడ ట్విస్టు ఏమిటంటే అది నిజమైన పాము కాదు.. చేతి గడియారంలో నిరంతరం సమయ సూచికగా తిరిగే పాము అది.

ఓ ఔత్సాహికుడు ధరంచిన చేతి గడియారం ఈ అద్భుతానికి వేదికైంది. గడియారం మెషిన్ లో రెండు ముల్లులకు, 12అంకెలకు చుట్టు ఓ పాము తిరుగుతూ సమయాన్ని గణించే రీతిలో భ్రమణం సాగిస్తుంది. అచ్చం నిజమైన పామును తలపించే రీతిలో మెలికలు తిరుగుతూ గడియారంలో పాము సంచరిస్తుండగా.. సమయం సాగి పోతుంటుంది. ఇప్పుడీ వింత గడియారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వామ్మో ఈ స్నేక్ గడియారం ధరించాలంటే కొంచం ధైర్యం కూడా ఉండాలంటు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు దీని తయారీదారుడి వినూత్న ఆవిష్కరణను ప్రశంసిస్తున్నారు.

సాంకేతికత పెరుతున్న కొద్ధి చారిత్రాక కాలం నుంచి కూడా గడియారాల తయారీ కొంత పుంతలు తొక్కుతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రకరకాల కాన్సెప్టుతో గడియారాలను రూపొందించగా వాటిలో చాల చరిత్రలో నిలిచాయి. ఇటీవల భారత్ లో అయోధ్య నూతన రామమందిరంతో కూడిన చేతి గడియారం కూడా వైరల్ గా మారింది. అదే బాటలో స్నేక్ వాచ్ కూడా వైరల్ కావడం విశేషం. స్నేక్ వాచ్‌ను చైనీస్/సింగపూర్ కంపెనీ Zbioland లగ్జరీ వాచెస్ తయారు చేసింది. 2025 పాము యొక్క చైనీస్ సంవత్సరంగా దాని గౌరవార్థం టైమ్‌పీస్ స్నేక్ వాచ్ ను రూపొందించారు. జులై 2025 నుండి షిప్‌మెంట్‌లతో దాదాపు $2,986 USDకి ఇక్కడ ఒకదానిని ప్రీ-ఆర్డర్ చేయవచ్చు.