ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలి ..స్పీకర్ సమయం కోరాం : మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి

బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని అందుకోసం చట్టపరంగా అన్ని దారుల్లో పోరాడుతామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలి ..స్పీకర్ సమయం కోరాం : మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి

విధాత: బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని అందుకోసం చట్టపరంగా అన్ని దారుల్లో పోరాడుతామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు.ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ,ఎమ్మెల్సీ తాత మధులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.మా పార్టీ ఎమ్మేల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం .సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బి ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని , వారి పై అనర్హత పిటిషన్ ఇవ్వడానికి స్పీకర్ సమయం కోరామని తెలిపారు. బుధవారం సమయం ఇస్తామని స్పీకర్ చెప్పారన్నారు.వారితో పాటు పార్టీ  ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావాల్సి ఉందన్నారు. పాంచ్ న్యాయ్ తీర్మానం ప్రకారం ఫిరాయింపులు ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెబుతున్నారని, ఫిరాయింపులపై రాహుల్ గాంధీ బిజెపిపై దాడి చేస్తుంటే ఇక్కడ రేవంత్ బిజెపికి తోకలా వ్యవహరిస్తున్నాడని జగదీష్ రెడ్డి విమర్శించారు. మోదీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడన్నారు.జీవన్ రెడ్డి మాట మీద నిలబడి పోరాడాలన్నారు.మేము పార్టీ ఫిరాయింపు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని, ప్రజల ముందు దోషిగాదోషిగా నిలబెడతామన్నారు.

స్పీకర్ న్యాయంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నామనీ ఆశాభావం వ్యక్తం చేశారు.సీఎం రేవంత్ భయంలో ఉన్నాడనికాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని..పదవిని కాపాడుకోవటానికి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీయేనని..రాజశేఖర్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదా అని ప్రశ్నించారు. మా నాయకున్ని మేము రోజు కలుస్తున్నామని హైకోర్టు తీర్పు తర్వాతే సుప్రీం కోర్టును ఆశ్రయిఇస్తామన్నారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రావచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్కమిషన్ విచారణ వద్దనటం లేదని..జస్టిస్ నర్సింహ రెడ్డిని తప్పించాలని కోరుతున్నామన్నారు.విచారణలో అన్ని తేటతెల్లం అవుతాయి… కేసీఆర్ మల్లె పూవులా బయటకు వస్తారని స్పష్టం చేశారు.