Horoscope | ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి జీవిత భాగస్వామితో మనస్పర్థలు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సామాజిక వేడుకల్లో, ఉత్సవాలలో పాల్గొంటారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. సన్నిహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు మంగళకరంగా ఉంటుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రమోషన్, జీతం పెరుగుదల సూచన ఉంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు, వెంచర్స్ ఆరంభించడానికి శుభ సమయం. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. గృహంలో సుఖశాంతులు నెలకొంటాయి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. ఉద్యోగ, వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడికి గురవుతారు. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సిఉంటుంది. బంధువులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించండి. కోపాన్ని అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా ఉండండి. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో పనిభారం, శ్రమ పెరుగుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు వేదన కలిగిస్తాయి. ఎవరితోను వాదనలకు దిగకుండా ప్రశాంతంగా, ఓపికతో ఉండండి. అనవసర ఖర్చులు తగ్గిస్తే మంచిది.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరమైన ఆటంకాలు తొలగిపోతాయి. మిత్రుల ద్వారా ప్రభావితం అవుతారు. అదృష్టయోగం ఉంది. స్నేహితుల సహకారంతో కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. మీ ప్రతిభ, సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ధనధాన్య లాభాలున్నాయి.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పనిప్రదేశంలో ఏమరుపాటు పనికిరాదు. చేపట్టిన పనుల్లో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోండి. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. ఖర్చులు బాగా పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెంపు వంటి శుభ ఫలితాలు ఉంటాయి. నాయకత్వ లక్షణాలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు ప్రత్యర్ధులు, పోటీదారులపై విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. వైద్యపరమైన వ్యయాలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మికత కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి. కీలక వ్యవహారాల్లో చంచల బుద్ధి కారణంగా సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మానవద్దు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు ఆందోళన కలిగిస్తాయి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. అన్ని వైపుల నుంచి అదృష్ట సంకేతాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక స్థిరత్వం, వృత్తి పరమైన పురోగతితో ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వైవాహిక జీవితం ఆనందమయంగా గడుస్తుంది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆస్తి వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. పనిపట్ల ఏకాగ్రత, చిత్తశుద్ధి అవసరం. ఆర్థిక క్రమశిక్షణతో ఖర్చులు అదుపులో ఉంటాయి. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది. ప్రియమైనవారితో మనస్పర్థలకు అవకాశం ఉంది.