Srisailam And Nagarjuna Sagar Gates Lifted : మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం..సాగర్ గేట్లు
ఎగువన వరద ఉధృతితో శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. సాగర్‌కు 1,01,1018 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

విధాత: వరుస వర్షాలు..వరదలు..ఎగువ ప్రాంతం జూరాల నుంచి కృష్ణమ్మ వరద ఉదృతి నేపధ్యంలో మరోసారి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీటి కారణంగా జలాశయం 6 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో ప్రాజెక్టు నుంచి ఉదయం 6 గేట్లు, సాయంత్రం 3గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేపట్టారు. సాగర్ నుంచి వస్తున్న వరద నేపథ్యంలో పులిచింతల గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ కు ఇన్ ఫ్లో 1,01,1018క్యూసెక్కులు, అవుట్ ఫ్లో అంతే స్థాయిలో కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 312టీఎంసీలకుగాను 311టీఎంసీలుగా ఉంది. 590అడుగులకుగాను..589.70అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది.