Apple CEO | టిమ్ కుక్ వారసుడు రెడీ.. యాపిల్ సీఈవో ఎవరంటే!

యాపిల్‌కు సుమారు పద్నాలుగేళ్లుగా నాయకత్వం వహిస్తున్న టిమ్‌ కుక్‌ 2026 జనవరిలో ఆ పదవి నుంచి తప్పుకుంటారన్న చర్చలు జరుగుతున్నాయి. ఆయన స్థానంలో యువకుడు, ఇంజినీరింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ టెర్నస్‌ బాధ్యతలు చేపడతారని అంచనా వేస్తున్నారు.

Apple CEO | టిమ్ కుక్ వారసుడు రెడీ.. యాపిల్ సీఈవో ఎవరంటే!
Apple CEO | టిమ్ కుక్. టెక్ ప్రపంచంలో ఈ పేరు వినని వారు ఉండరు. ముఖ్యంగా యాపిల్ ఉత్పత్తులు వాడే వారికి సుపరిచితం. 2011 నుంచి ఆయన యాపిల్‌ సీఈవోగా పనిచేస్తున్నారు. కంపెనీ ఎదుగుదలలో ఎంతో శ్రమించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు టెక్ ప్రపంచంలో ప్రచారం జరుగుతోంది. నవంబర్ నెల చివరి నాటికి కుక్ 65వ వడిలో పడుతున్నారు. జాన్ టెర్నస్ ప్రస్తుతం హార్డ్ వేర్ ఇంజనీరింగ్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. 2026 మధ్యలో కుక్ నుంచి సీఈవో బాధ్యతలు తీసుకోవచ్చని అంటున్నారు.
జాన్ టెర్నస్ యాపిల్ ఎగ్జిక్యూటివ్ టీమ్ లో యంగెస్టు మెంబర్ గా ఉన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఈయనను నియమించనున్నారు. ఐ ఫోన్లు, ఐ ప్యాడ్లు, ఎయిర్ పాడ్ వంటి లేటెస్టు జనరేషన్ ఉత్పత్తుల్లో టెర్నస్ క్రియాశీల పాత్ర ఉంది. కుక్ దశాబ్ధకాలం కొనసాగిన విధంగానే టెర్నస్ కూడా అంతే కాలం పాటు సీఈఓ గా వ్యవహరించనున్నారు. యాపిల్ ఉత్పత్తుల విశేష ప్రచారం, విక్రయాల్లో టిమ్ కుక్ నాయకత్వ ముద్ర బలంగా ఉంది. సీఈఓ గా వైదొలిగిన తరువాత ప్రెసిడెంట్ బాధ్యతల్లో కొనసాగుతారని, ఎప్పుడు ఈ బాధ్యతల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని చెప్పలేమనే ప్రచారం టెక్ సర్కిల్ చర్చించుకుంటున్నారు.
1976, ఏప్రిల్ 1న స్టీవ్‌ జాబ్స్‌, స్టీవ్‌ వోజ్‌నియాక్‌, రోనాల్డ్‌ వేన్‌ ఈ సంస్థను స్థాపించారు. ప్రధాన కార్యాలయం అమెరికాలోని కాలిఫోర్నియాలో క్యూపర్టినోలో ఉంది. మొదట కంప్యూటర్‌ కంపెనీగా ప్రారంభమైన యాపిల్‌.. తర్వాత మొబైల్‌, సాఫ్ట్‌వేర్‌, ఎన్‌టర్‌టైన్‌మెంట్‌, వేరబుల్స్‌, క్లౌడ్‌ సర్వీసెస్‌ వంటి అనేక రంగాల్లో విస్తరించింది. యాపిల్‌ ఐ ఫోన్‌ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌. ఇది ఐవోఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తుంది.
యాపిల్‌ కంపెనీ ప్రపంచంలోనే తొలి ట్రిలియన్‌ డాలర్‌ కంపెనీగా 2018లో ప్రఖ్యాతి పొందింది. 2024 నాటికి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. iPhone, iPod, iPad, MacBook వంటి ప్రోడక్ట్స్ వెనుక ప్రధాన స్ఫూర్తి స్టీవ్‌ జాబ్స్‌ మరణం తర్వాత టిమ్‌ కుక్‌ ఈ కంపెనీ సీఈవో అయ్యారు. టిమ్‌ కుక్‌ నేతృత్వంలో సర్వీసెస్‌, వేరబుల్స్‌, చిప్‌ డిజైన్‌ భారీగా పెరిగాయి.
ఇవి కూడా చదవండి..