iPhone 13 | ఐఫోన్ 13పై క్రోమా బంపర్ ఆఫర్..! రూ.13వేలకుపైగా తగ్గింపు.. ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై మరింత డిస్కౌంట్..!
iPhone 13 | మొబైల్స్‌లో ఆపిల్ ఫోన్స్‌కు ఆ క్రేజే వేరు. ఇటీవల ఐఫోన్ 15 సిరీస్‌ను ఆపిల్ లాంచ్ చేయగా.. పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇక పాత మోడల్స్‌పై పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఆఫర్స్‌ను ఈ కామర్స్ ప్లాట్‌ఫారాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పలు ఈ కామర్స్ సైట్స్ పలు మోల్స్పై ఆఫర్స్‌ను ప్రకటించగా.. తాజాగా ఐఫోన్ క్రోమా ఐ ఫోన్ 13 పై డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది.
ఐఫోన్ 13 మోడల్ 128 జీబీ వేరియంట్‌పై మంచి డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నది. ఈ ఫోన్‌పై 19.47 శాతం తగ్గింపును అందిస్తున్నది. ఐఫోన్ 13 అసలు ధర రూ.69,900 కాగా.. క్రోమాలో ఈ ఫోన్‌ను కేవలం రూ. 56,290 ఇస్తున్నది. దాదాపు రూ.13,610 వరకు ఆదా కానుంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ సౌకర్యం కల్పిస్తున్నది. వర్కింగ్ కండిషన్లో ఉన్న స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరింత ధర తగ్గనున్నది.
ఎక్స్ఛేంజ్ చేయనున్న ఫోన్‌ను బట్టి ధర నిర్ణయించనున్నదారు. అదే సమయంలో హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డు ఉంటే మరింత డిస్కౌంట్ లభించనున్నది. ఐఫోన్ 13 వేరియంట్ 128 జీబీ స్టోరేజ్‌తో లభించనున్నది.
6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేతో పాటు 12MP ప్లస్ 12MP డ్యూయల్ రియర్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంటుంది. ఐఫోన్ 13 శక్తిమంతమైన A15 బయోనిక్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఐ ఫోన్ 13లో 15W వైర్లెస్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. దీంతో 20W అడాప్టర్‌తో కేవలం 30 నిమిషాల్లో 50శాతం వరకు ఛార్జ్ చేస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram