Samsung | ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వాడాలని చాలామందికి ఉంటుంది. కానీ అంత ధర పెట్టలేక బడ్జెట్ ఫోన్లకే పరిమితమవుతుంటారు. అలాంటి వారి కోసం తక్కువ ధరలోనే ప్రీమియం ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాంసంగ్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్టిఫైడ్ రీ న్యూడ్ (Certified Re-Newed) ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రీఫర్బిష్‌డ్(Refurbished Mobiles) స్మార్ట్‌ఫోన్లను భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్‌లో Samsung Galaxy S25 సిరీస్‌తో పాటు Galaxy A సిరీస్‌కు చెందిన కొన్ని ప్రముఖ మోడళ్లు కూడా ఉన్నాయి.
Refurbished Mobiles అంటే సెకండ్ హ్యాండ్ ఫోన్లు.. ఏదో డ్యామేజ్ లేదా సమస్య వల్లనే మొదట కొనుగోలు చేసిన వారు అమ్మి ఉండొచ్చని అనుకోవచ్చు. కానీ తాము అమ్మే ప్రతి ఫోన్‌ను ప్రత్యేకంగా తనిఖీ చేసి, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పరంగా పూర్తిస్థాయిలో పరీక్షించిన తర్వాతనే వీటిని విక్రయిస్తున్నట్లు శాంసంగ్ కంపెనీ తెలిపింది. ఏదైనా డ్యామేజ్ ఉంటే వాటిని ఒరిజినల్ శాంసంగ్ విడిభాగాలతో మరమ్మతులు చేసి కొత్త బాక్స్‌లో అందిస్తుంది. దీనివల్ల వినియోగదారుడికి కొత్త మొబైల్ కొనుగోలు చేసిన ఫీలింగ్ ఉంటుందని పేర్కొంది. అలాగే కొత్త ఫోన్ల మాదిరిగానే ఈ Certified Re Newed మొబైళ్లపై ఒక సంవత్సరం వారంటీ(Manufacturing Warranty) కూడా అందిస్తున్నట్లు తెలిపింది.
ఈ Re Newed స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం శాంసంగ్ ఇండియా అఫిషియల్ వెబ్‌సైట్‌తో పాటు శాంసంగ్ షాప్ యాప్‌లోనూ అందుబాటులో ఉన్నాయి.
Galaxy S25 Ultra మొబైల్‌పై భారీ తగ్గింపు
Galaxy S25 Ultra Renewed వేరియంట్‌పై అత్యధిక తగ్గింపు కనిపిస్తోంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ కేవలం రూ.97,49కే లభిస్తోంది. ఇదే మోడల్ కొత్త మొబైల్ మార్కెట్‌లో రూ.1,29,999కి విక్రయిస్తున్నారు. అంటే దాదాపు రూ.32 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. Samsung Galaxy S25 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ మోడల్ ధర కూడా భారీగా తగ్గించారు. కొత్త ఫోన్ ధర రూ.62,999 కాగా, రీన్యూడ్ వెర్షన్‌ను రూ.58,749కే అందిస్తున్నారు.
మిడిల్ క్లాస్ కస్టమర్లకు స్పెషల్‌గా A సిరీస్
ప్రీమియం ఫోన్లతో పాటు మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని గెలాక్సీ A సిరీస్ ఫోన్లను కూడా శాంసంగ్ కంపెనీ తక్కువ ధరకే అందిస్తోంది. Samsung Galaxy A56 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.44,999 కాగా, రూ.32,749కే విక్రయిస్తోంది. అలాగే A36 మోడల్‌కు చెందిన 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం రూ.23,249కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.32,999.
పూర్తి తనిఖీ తర్వాతే విక్రయాలు
సెకండ్ హ్యాండ్ మొబైళ్లను అమ్మేముందు ప్రతి ఫోన్‌పై వివిధ దశల్లో పరీక్షలు నిర్వహిస్తామని శాంసంగ్ కంపెనీ వెల్లడించింది. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, స్పీకర్లు, నెట్‌వర్క్ కనెక్టివిటీ వంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే వీటిని విక్రయానికి ఉంచుతామని తెలిపింది. అదనంగా పాత యూజర్ డేటాను పూర్తిగా తొలగించి, తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లతో ఈ ఫోన్లను అందిస్తున్నామని చెప్పింది. ప్రతి ప్యాకేజీలో కొత్త బాక్స్‌తో పాటు క్విక్ట్ స్టార్ట్ గైడ్, డేటా కేబుల్, సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇస్తున్నారు. ఈ మొబైళ్లు అన్ని నెట్‌వర్క్‌లకు అనుకూలంగా పనిచేస్తాయని కంపెనీ తెలిపింది.
ప్రతి ప్యాకేజీలో కొత్త బాక్స్‌తో పాటు క్విక్ స్టార్ట్ గైడ్, డేటా కేబుల్, సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇస్తున్నారు. ఈ ఫోన్లు అన్ని మొబైల్ నెట్‌వర్క్‌లకు అనుకూలంగా పనిచేస్తాయని కంపెనీ తెలిపింది.
Read More:
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భారీ ఆఫర్.. ఎన్నడూ లేనంత తక్కువ ధరకే Samsung Galaxy S25 Ultra!
