Australia vs England| యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా టార్గెట్ 205పరుగులు
యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో రెండోరోజు ఇంగ్లాండ్ 34.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో దక్కిన 40 పరుగుల ఆధిక్యంతో కలిపి ఆసీస్‌కు 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య చేధనలో ఆసీస్ బ్యాటర్లు దూసుకెలుతున్నారు.
విధాత : యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ (Australia vs England)రెండో ఇన్నింగ్స్‌లో రెండోరోజు ఇంగ్లాండ్ 34.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో దక్కిన 40 పరుగుల ఆధిక్యంతో కలిపి ఆసీస్‌కు 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ లో మాదిరిగానే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లోనూ ఆసీస్ బౌలర్లు ఆధిపత్యం చాటారు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు మరోసారి స్వల్ప స్కోరుతోనే సరిపెట్టుకున్నారు.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో గస్ అట్కిస్సన్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బెన్ డకెట్ (28), ఓలీ పోప్ (33), బ్రైడన్ కార్స్ (20) పరుగులు సాధించారు. ఓపెనర్ క్రాలే(0), బ్రూక్(0),జోరూట్(8), బెన్ స్టోక్స్(2), జెమీ స్మిత్(15), ఆర్చర్(5) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోల్యాండ్ 4, మిచెల్ స్టార్క్, బ్రైడెన్ డగ్గెట్ చెరో 3 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
చేధనలో దూసుకెలుతున్న ఆసీస్ బ్యాటర్లు
205పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంలో ఆసీస్ బ్యాటర్లు మెరుగ్గా ఆడుతున్నారు. 15ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 89పరుగులతో లక్ష్య చేదన దిశగా సాగిపోతుంది. ఓపెనర్ వెదర్లాడ్ 23పరుగులకు కార్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఓపెనర్ హెడ్ 55పరుగులతో, లబుషైన్ 12పరుగులతో ఆడుతున్నారు.
అంతకు ముందు.. 123/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 45.2 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్ క్యారీ (26) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ (21), కామెరూన్ గ్రీన్ (24) ఫర్వాలేదనిపించారు. జేక్ వెదర్లాండ్ (0), లబుషేన్ (9), స్టీవ్ స్మిత్ (17), ఉస్మాన్ ఖవాజా (2) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్‌స్టోక్స్ 5, బ్రైడన్ కార్స్ 3, జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram