Women’s T20 World Cup | న్యూజీలాండ్‌పై ఆసీస్ ఘనవిజయం – భారత్ సెమీస్ ఆశలు సజీవం
న్యూజీలాండ్ చేతిలో భారత్ తన మొదటి మ్యాచ్ పరాభవం సెమీస్ ప్రవేశానికే ఎసరు పెట్టింది. అయితే ఇవాళ ఆస్ట్రేలియా–న్యూజీలాండ్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ న్యూజీలాండ్‌ను భారీ తేడా(Australia dominates Newzealand)తో ఓడించడంతో భారత్(India) సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నట్లే.

ఆస్ట్రేలియా–న్యూజీలాండ్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించి సెమీస్‌కు దారి సుగమం చేసుకుంది. న్యూజీలాండ్‌ను ఘోర పరాభావం(Big defeat for NZ) పాలుజేసి, ఆసీస్ భారత్ నెత్తిన పాలు పోసింది. 60 పరుగుల భారీ తేడాతో గెలవడంతో ఆస్ట్రేలియా రన్‌రేట్ +1.908 నుండి ఎకాఎకిన +2.524కు చేరుకోగా, కివీస్ +2.9000 నుండి –0.050కు దారుణంగా పడిపోయింది(NZ NRR big dip). నిజానికి ఆసీస్ ఓ మోస్తరు తేడాతో గెలిచి ఉంటే, న్యూజీలాండ్ రన్‌రేట్‌లో పెద్ద తేడా ఉండేది కాదు. అప్పుడు భారత్ సెమీస్ ఆశలు బాగా సన్నగిల్లేవి. కానీ, ఇప్పుడు ఇండియా రన్‌రేట్‌కు, కివీస్ రన్‌రేట్‌కు పెద్ద తేడా లేకపోవడం, పాయింట్లు కూడా సమానంగా రెండే ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. రేపు శ్రీలంక(Srilanka)తో మ్యాచ్‌తో ఆసీస్‌లా ఘనవిజయం సాధిస్తే నాలుగు పాయింట్లతో పెరిగిన రన్‌రేట్‌తో న్యూజీలాండ్‌ను అధిగమించే అవకాశం ఉంటుంది. నిజానికి పాకిస్తాన్(Pakistan) భారత్ కన్నా మెరుగైన స్థితిలో ఉంది. వాళ్లు కూడా రెండు పాయింట్లతో, ఎక్కువ రన్‌రేట్‌తో ఉన్నారు. కానీ, వారికి మిగిలిన రెండు మ్యాచ్‌లూ ఆసీస్, కివీస్‌తో ఉన్నాయి. అవి గెలవడం అంత ఈజీ కాదు.
ఇక్కడ ఇంకో మెలిక కూడా ఉంది. న్యూజీలాండ్‌కు కూడా శ్రీలంక, పాక్‌లతో మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. భారత్‌కు శ్రీలంక కాకుండా ఆస్ట్రేలియా పేరున ఓ గండం ఉంది. కివీస్ ఆ రెండూ గెలిచి (అవకాశాలు చాలా ఎక్కువ), ఇండియా ఆసీస్ చేతిలో ఓడిపోతే ( దీనికి కూడా అవకాశం ఎక్కువే) ఇంటిముఖం పట్టాల్సిఉంటుంది. ఏదైనా అద్భుతం జరిగి, ఆసీస్ మన చేతిలో ఓడితే అంతా హ్యాపీ.
ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది:
అస్ట్రేలియా 4 పాయింట్లు +2.524 నె.ర.రే ఆడాల్సింది: పాక్, భారత్
న్యూజీలాండ్ 2 పాయింట్లు –0.050 నె.ర.రే ఆడాల్సింది: శ్రీలంక, పాక్
పాకిస్తాన్ 2 పాయింట్లు +0.555 నె.ర.రే ఆడాల్సింది: ఆసీస్, కివీస్
భారత్ 2 పాయింట్లు –1.217 నె.ర.రే ఆడాల్సింది: శ్రీలంక, ఆసీస్
శ్రీలంక 0 పాయింట్లు –1.667 నె.ర.రే ఆడాల్సింది: భారత్, కివీస్
ఇలా భారత్ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా ఉంది. రేపటి మ్యాచ్ చాలా చాలా ముఖ్యమైనది. మిగతావారి సంగతెలా ఉన్నా, రన్‌రేట్‌ను భారీగా పెంచుకునే సువర్ణావకాశం ముందుంది. తూతూ మంత్రం గెలుపు ఏ మాత్రం పనికిరాదు. మొత్తానికి భారత్ ప్రయాణం రసకందాయంలో పడిన మాట మాత్రం వాస్తవం.