India Vs West Indies | వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన
భారత్-వెస్టిండీస్ టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ జట్టు ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, జడేజా వైస్ కెప్టెన్‌గా ఎంపిక.

విధాత : స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్( వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌దీప్ యాదవ్ లను ఎంపిక చేసింది.
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయపడిన రిషభ్ పంత్‌కు బదులు ఎన్.జగదీశన్‌కు చోటు కల్పించారు. కరణ్ నాయర్ కు ఉద్వాసన పలికారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ నాలుగో సీజన్‌లో భాగంగా భారత్ తొలిసారి స్వదేశంలో వెస్టిండిస్ తో టెస్టు సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు రెండు టెస్టుల సిరీస్ లో తలపడనుంది.