India Vs West Indies 2nd Test : గిల్ సూపర్ సెంచరీతో భారత్ 518/5 డిక్లేర్..విండీస్ ఎదురీత
గిల్ సూపర్ సెంచరీతో భారత్ 518/5 డిక్లేర్. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 140/4 భారత్‌కు 378 పరుగుల తేడా.

విధాత: ఢిల్లీ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత క్రికెట్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ శుభమన్ గిల్ ఆజేయ సూపర్ సెంచరీ( (129*,196 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహాయంతో 5 వికెట్ల నష్టానికి 518పరుగుల భారీ స్కోర్ సాధించి డిక్లేర్ చేసింది. రెండో రోజు 20 పరుగుల వద్ద శుభ్‌మాన్ గిల్ తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. 177 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్‌తో తన 10వ టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్ అయ్యాక గిల్ ఆడిన ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలు చేశాడు. వాటిలో నాలుగు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సారథిగా విరాట్ కోహ్లీతో గిల్ సమంగా నిలిచాడు. విరాట్ (2017, 18) వరుస సంవత్సరాల్లో ఐదు సెంచరీలు చేశాడు. ఇక ఈ టెస్టులో యంగ్ ఓపెనర్ యశస్వి 175 పరుగుల వద్ద గిల్ తో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యాడు. సాయిసుదర్శన్ (87), కేఎల్ రాహుల్ (38), నితీశ్‌కుమార్‌రెడ్డి (43) రాణించారు. మరోవైపు ధ్రువ్ జురెల్ (44) కూడా దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు శతక భాగస్వామ్యం నిర్మించారు. జురెల్ అవుటైన వెంటనే కెప్టెన్ గిల్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. విండీస్ బౌలర్లలో వారికన్ 3, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీశారు.
వెస్టిండీస్ ఎదురీత
రెండో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ తర్వాత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్ల ధాటికి ఎదురీదుతుంది. ఓపెనర్లు జాన్ కాంప్ బెల్(10), టి.చంద్రపాల్(34)తో పాటు కెప్టెన్ రోస్టన్ ఛేజ్(0) జడేజా స్పిన్ కు చిక్కారు. కుల్దీప్ యాదవ్ మరో విండీస్ బ్యారట్ అలిక్ అథనాజ్(41) అవుట్ చేశాడు. విన్ ఇమ్లాచ్ (14; 31 బంతుల్లో బ్యాటింగ్), షైయ్ హోప్ (31; 46 బంతుల్లో బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి రోజు 4వికెట్ల నష్టానికి 140పరుగులు చేసింది. ఇంకా భారత్ కంటే 378పరుగులు వెనుకబడింది. భారత బౌలర్లలో జడేజా 3/37 రాణించాడు.