Hardik Pandya| హార్ధిక్ పాండ్యా, న‌టాషాల విడాకుల రూమ‌ర్ అంతా ఫేకా.. నిజం ఏంటి మ‌రీ!

Hardik Pandya|  గత కొద్ది రోజులుగా హార్ధిక్ పాండ్యా విడాకుల‌కి సంబంధించి నెట్టింట అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్ధిక్ పాండ్యా, న‌టాషాలు విడాకులు తీసుకోబోతున్నార‌ని, హార్దిక్ పాండ్యా భరణం కింద తన ఆస్తిలో 70 శాతం ఆమెకు ఇచ్చేస్తాడు అంటూ కూడా ప్ర‌చారాలు

  • Publish Date - May 29, 2024 / 06:31 AM IST

Hardik Pandya|  గత కొద్ది రోజులుగా హార్ధిక్ పాండ్యా విడాకుల‌కి సంబంధించి నెట్టింట అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్ధిక్ పాండ్యా, న‌టాషాలు విడాకులు తీసుకోబోతున్నార‌ని, హార్దిక్ పాండ్యా భరణం కింద తన ఆస్తిలో 70 శాతం ఆమెకు ఇచ్చేస్తాడు అంటూ కూడా ప్ర‌చారాలు కూడా సాగాయి. అయ‌తే ఎన్ని ప్ర‌చారాలు జ‌రుగుతున్నా కూడా ఈ జంట మాత్రం స్పందించ‌డం లేదు.అయితే హార్దిక్ పాండ్యా, నటాషాల విడాకుల పర్వం కొనసాగుతున్న నేప‌థ్యంలో వారి విడాకుల‌కి సంబంధించిన పోస్ట్ ఒక‌టి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇది చూసి జ‌నాలు అవాక్క‌వుతున్నారు.

హార్దిక్ పాండ్యా, నటాషాల విడాకుల వ్యవహారం కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేన‌ని తెలుస్తుంది. ఐపీఎల్‌లో ముంబై కెప్టెన్‌గా పాండ్యా దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డంతో అభిమానులు తీవ్ర ఆగ్ర‌హానికి గురి కావ‌డం మ‌నం చూశాం. అయితే వారి ఆగ్ర‌మాన్ని చ‌ల్లార్చ‌డానికి ఈ విడాకుల వ్య‌వ‌హారాన్ని తెర‌పైకి తెచ్చిన‌ట్టు తెలుస్తుంది. అందుకే హార్దిక్ పాండ్యా, నటాషా ఇప్పటికీ విడాకుల గురించి ఎలాంటి కామెంట్స్ చేయ‌డం లేద‌ని పోస్ట్‌లో ఉంది. అయితే ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుండ‌గా, ఇది చూసిన ఫ్యాన్స్ అవాక్క‌వుతున్నారు. అయితే ఈ పోస్ట్ లో కూడా ఎంత నిజం ఉంద‌నేది మాత్రం తెలియ‌రావ‌డం లేదు.

కాగా, హార్దిక్ పాండ్యా, నటాషా 2020 లో వివాహం చేసుకోగా, వీరి ఇప్పుడు క కొడుకు కూడా ఉన్నాడు. కాగా హార్దిక్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం అమెరికా వెళ్లాడు. ఐపీఎల్‌లో పూర్తిగా తేలిపోయిన హార్ధిక్ క‌నీసం పొట్టి ప్ర‌పంచ్ క‌ప్‌లో అయిన స‌త్తా చాటాల‌ని భావిస్తున్నాడు. ఇక హార్ధిక్ స‌తీమ‌ణి న‌టాషా విష‌యానికి వ‌స్తే ఈమె పూర్తిపేరు నటాషా స్టాన్కోవిక్. సెర్బియాకు చెందిన మోడల్, నటి, డాన్సర్ కూడా. నటిగా తన కెరీర్ ని బిల్డ్ చేసుకోవడానికి 2012లో ఇండియాకి వ‌చ్చిన ఈ అమ్మ‌డు 2013లో సత్యాగ్రాహి అనే ఒక హిందీ సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. చాలానే సినిమాలు చేసిన న‌టాషా ఎక్కువ క్యామియో అప్పియ‌రెన్స్‌లే ఎక్కువ‌గా ఇచ్చింది. 2019లో ది బాడీ అనే బాలీవుడ్ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఇదే త‌న చివ‌రి చిత్రం

ic-are-not-getting-divorced

Latest News