Hardik Pandya | శ్రీలంక టూర్‌లో టీ20 కెప్టెన్‌గా హార్దిక్ ప్యాండ్యా..! వన్డే సారథిగా కేఎల్ రాహుల్‌కు ఛాన్స్..?
Hardik Pandya | భారత జట్టు జూలై నెలాఖరులో టీమిండియా పర్యటనకు వెళ్లనున్నది. ఈ టూర్‌లో శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్‌లు, మరో మూడు వన్డే మ్యాచులు ఆడనున్నది. ఇక టీమిండియా కొత్తగా కోచ్ గౌతమ్ గంభీర్ పదవీకాలం మొదలవనున్నది. టీ20 వరల్డ్ కప్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Hardik Pandya | భారత జట్టు జూలై నెలాఖరులో టీమిండియా పర్యటనకు వెళ్లనున్నది. ఈ టూర్‌లో శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్‌లు, మరో మూడు వన్డే మ్యాచులు ఆడనున్నది. ఇక టీమిండియా కొత్తగా కోచ్ గౌతమ్ గంభీర్ పదవీకాలం మొదలవనున్నది. టీ20 వరల్డ్ కప్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ స్థానంలో టీ20 కెప్టెన్‌గా లంక టూర్‌కు ఎవరిని ఎంపిక చేస్తారని చర్చ జరుగుతుంది. అయితే, టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నది. ఈ విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్‌లో పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కెప్టెన్‌గా హార్దిక్‌ను నియమించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతున్నది.
శ్రీలంకతో టీమిండియా జులై 27 నుంచి 30 వరకు మూడు టీ20లు, ఆగస్టు 2 నుంచి 7 వరకు మూడు వన్డేలు ఆడనున్నది. లంకతో వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ పునరాగమనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేఎల్ రాహుల్ ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాలో స్థానం దక్కించుకోలేకపోయాడు. టీ20 ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లతో గట్టిపోటీని ఎదుర్కొంటున్నాడు. వన్డే సిరీస్‌కు సైతం కెప్టెన్‌గా పాండ్యానే వ్యవహరిస్తాడా..? మరికరిని నియమిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. వన్డే సిరీస్‌కు సైతం కెప్టెన్ రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నారు. వన్డే జట్టు నాయకత్వ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించే అవకాశాలు లేకపోలేదని ప్రచారం జరుగుతున్నది. సుదీర్ఘ ఫార్మాట్‌లో రాహుల్ పరుగులు చేయగలుగుతాడని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో లంక టూర్‌లో రెండు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను బరిలోకి దింపాలని బీసీసీఐ నిర్ణయించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.