Ind v Nz|రాణించిన గిల్, పంత్.. 28 పరుగుల ఆధిక్యంలో భారత్
Ind v Nz|ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించేందుకు కృషి చేస్తుంది. తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన భారత్ ఈ మ్యాచ్‌లో కొంత మెరుగైన ప్రదర్శన కనబరుస్తుంది. బౌలింగ్‌లో రాణించిన భారత్, బ్యాటింగ్‌లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచింది అని

Ind v Nz|ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత్(India) విజయం సాధించేందుకు కృషి చేస్తుంది. తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన భారత్ ఈ మ్యాచ్‌లో కొంత మెరుగైన ప్రదర్శన కనబరుస్తుంది. బౌలింగ్‌లో రాణించిన భారత్, బ్యాటింగ్‌లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచింది అని చెప్పాలి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 263 పరుగులకి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను హాఫ్ సెంచరీలతో గట్టెక్కించారు పంత్,గిల్ . వన్డే, టీ20 తరహాలో రిషబ్ పంత్ ఫోర్లు సిక్సర్లతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.కేవలం 36 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన పంత్(pant) ఊహించని విధంగా సోది బౌలింగ్‌లో ఔటయ్యాడు.
59 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడుతూ 90 పరుగులు చేసాడు. పటేల్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న మిచెల్(Mitchel)కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించడంతో టీమిండియాకి 28 పరుగుల ఆధిక్యం లభించింది. 36 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 పరుగులు చేశాడు సుందర్. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్(138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), డారిల్ మిచెల్(129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. ఆకాశ్‌దీప్ ఓ వికెట్ తీసాడు.
ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన న్యూజిలాండ్(New Zealand)కి ఆకాశ్ దీప్ అదిరిపోయే జలక్ ఇచ్చాడు. లాథమ్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ రెండు ఓవర్లకి గాను 6 పరుగులు చేసి వికెట్ కోల్పోయింది. క్రీజులో యంగ్(1 ), కాన్వే (3 ) ఉన్నారు.