Ind vs NZ|భార‌త్-కివీస్ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేస్తున్న భార‌త్.. టెస్ట్ ర‌ద్దైతే టీమిండియాకి చాలా న‌ష్టం

Ind vs NZ|వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్‌లో భాగంగా ఫైన‌ల్‌కి అర్హ‌త పొందేందుకు భార‌త్ గ‌ట్టిగానే కృషి చేస్తుంది. డ‌బ్ల్యూటీసీకి చేరాలంటే భార‌త్ త‌ప్ప‌నిస‌రిగా న్యూజిలాండ్‌తో సిరీస్ గెలిచి తీరాలి. అక్టోబ‌ర్ 16 నుండి తొలి టెస్ట్ మొద‌లు కావ‌ల్సి ఉండ‌గా, వ‌ర్షం వ‌ల‌న పూర్తిగా ర‌ద్దైంది. వర్షం ధాటికి కనీసం టాస్ కూడా పడ

  • By: sn    sports    Oct 17, 2024 9:21 AM IST
Ind vs NZ|భార‌త్-కివీస్ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేస్తున్న భార‌త్.. టెస్ట్ ర‌ద్దైతే టీమిండియాకి చాలా న‌ష్టం

Ind vs NZ|వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్‌లో భాగంగా ఫైన‌ల్‌కి అర్హ‌త పొందేందుకు భార‌త్ గ‌ట్టిగానే కృషి చేస్తుంది. డ‌బ్ల్యూటీసీకి(WTC) చేరాలంటే భార‌త్ త‌ప్ప‌నిస‌రిగా న్యూజిలాండ్‌(New Zealand)తో సిరీస్ గెలిచి తీరాలి. అక్టోబ‌ర్ 16 నుండి తొలి టెస్ట్ మొద‌లు కావ‌ల్సి ఉండ‌గా, వ‌ర్షం వ‌ల‌న పూర్తిగా ర‌ద్దైంది. వర్షం ధాటికి కనీసం టాస్ కూడా పడలేదు. వర్షం కారంగా మొదటి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకోని పోవడంతో రెండో రోజులో ఆటలో మార్పులు చేశారు. సెషన్ టైమింగ్స్‌ను మార్చారు. 90 ఓవర్లు కంటే ఎక్కువగా ఆట జరిగేలా సెషన్లలో మార్పులు చేశారు. ఇక మార్నింగ్ సెషన్‌ను ఉదయం 9.15 నుంచి 11.30 గంటలకు వరకు, ఆ తర్వాత రెండో సెషన్‌ను మధ్యాహ్నం 12.10 నుంచి 14.25 వరకు నిర్వహించనున్నారు.

ఇక చివ‌రి సెషన్‌ను మధ్యాహ్నం 2.45 నుంచి 4.45 వరకు నిర్వహించనున్నారు. అయితే వాతావ‌ర‌ణం ప్ర‌స్తుతం బాగ‌నే ఉన్నా మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌రుణుడు ఆట‌క ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాగా, మ్యాచ్ వేదిక అయిన చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజి వ్యవస్థ ఉంది. దీంతో త్వ‌ర‌గానే అంతా సెట‌ప్ చేయ‌నున్నారు. తొలి రోజు పూర్తిగా తుడిచి పెట్టుకుపోవ‌డం వ‌ల‌న ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవ‌కాశం ఉంది. అయితే బెంగళూరు(Bangalore) టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిస్తే.. టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. తొలి టెస్టు మ్యాచ్ డ్రా అయితే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉన్న టీమిండియాకు కేవ‌లం నాలుగు పాయింట్లు మాత్ర‌మే ద‌క్క‌నున్నాయి.

సాధార‌ణంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కింద టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు 12 పాయింట్లు ఇస్తారు. టై అయితే, రెండు జట్లకు 6 పాయింట్లు ఇస్తారు. అలాగే, మ్యాచ్ డ్రాగా ముగిస్తే ఇరు జట్లకు 4 పాయింట్లు చొప్పున కేటాయిస్తారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రస్తుత మూడవ ఎడిషన్‌లో, టీమ్ ఇండియా ఇప్పటివరకు మొత్తం 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా, అందులో 8 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌లు ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఈ ప్రదర్శనతో రోహిత్ సేన 74.24 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా విజయ శాతం 62.50గా ఉంది. ఇది భారత్‌ (India)కంటే కొంచెం వెనుకబడి ఉంది. మూడో స్థానంలో ఉన్న శ్రీలంక 55.56 విజయాల శాతంతో ఉండగా, ఇంగ్లండ్ 45.59 విజయ శాతంతో నాలుగో స్థానంలో ఉంది. ఇప్పుడు వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో ఆడాలంటే రోహిత్ జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. బెంగళూరు టెస్టుతో పాటు భారత్ ఇంకా 7 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది