IND Vs PAK: భారత్ టార్గెట్ 127
దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఆసియా కప్ టి20 లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్లకు 127 పరుగులకు సాధించింది.. ఈ మ్యాచ్ లో గెలవాలంటే భారత్ 127 పరుగుల లక్ష్యాన్ని చేదించాల్సి ఉంది

విధాత : దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఆసియా కప్ టి20 లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులకు సాధించింది.. ఈ మ్యాచ్ లో గెలవాలంటే భారత్ 127 పరుగుల లక్ష్యాన్ని చేదించాల్సి ఉంది. భారత స్పిన్నర్ల ధాటికి పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఒక పరుగుకే తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ ఆద్యంతం వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్లలో అత్యధికంగా ఫర్విన్ 40(44) పరుగులు సాధించాడు. చివర్లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది 33(16) పరుగులు సాధించడంతో పాకిస్తాన్ ఈ మాత్రం స్కోర్ అయినా సాధించగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర పటేల్ 2 వికెట్లు, బూమ్రా 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలోవికెట్టు సాధించారు.