INDvsAUS 3rd T20| మూడో టీ20లో ఆసీస్‌పై భారత్ ఘన విజయం
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగాఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అసీస్ విధించిన 187 పరుగుల లక్ష్యాన్ని 5వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది.
విధాత : ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్(India) 5 వికెట్ల తేడాతో ఘన విజయం(Victory) సాధించింది. అసీస్ విధించిన 187 పరుగుల లక్ష్యాన్ని 5వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది. వాషింగ్టన్ సుందర్ (49*) వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ (25), సూర్య (24), తిలక్ వర్మ (29), జితేశ్ (22*) రాణించారు. శుభమన్ గిల్ 15, అక్షర పటేల్ 17పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ 3 వికెట్లు, స్టాయినిస్, బార్ట్ లెట్ చెరో వికెట్ తీశారు.
ఇప్పటిదాక జరిగిన మూడు టీ 20మ్యాచ్ లలో తొలి మ్యాచ్ వర్షంతో రద్దవ్వగా..రెండో మ్యాచ్ లో అసీస్ విజయం సాధించగా..మూడో మ్యాచ్ లో టీమిండియా గెలుపొందింది. దీంతో ఈ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.
అంతకు ముందు టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన అసీస్ 186/6 పరుగులు చేసింది. భారత్ ముందు 187పరుగుల టార్గెట్ ను పెట్టింది. అసీస్ ఓపెనర్లు హెడ్ 6, మిచెల్ మార్ష్ 11 పరుగులకే వెనుతిరిగారు. ఇంగ్లీస్ 1, మిచెల్ ఓవెన్ 0 పరుగులకే ఔటయ్యారు. దీంతో అసీస్ ఓ దశలో 8.3ఓవర్లలో 4వికెట్లు కోల్పోయింది. అయితే టీమ్ డెవిడ్ (74; 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), మార్కోస్ స్టెయినిస్ (64; 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో అసీస్ ను ఆదుకున్నారు. దీంతో అస్ట్రేలియా 186పరుగులు చేయగలిగింది. మాధ్యూ షార్ట్ 26, బార్ట్ లెట్ 3పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2, శివమ్ దూబె 1వికెట్ సాధించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram