విధాత : ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే టీమీండియా వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు అవకాశం ఇచ్చింది. ఆప్ఘాన్ తో మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ను మాత్రం ఎంపిక చేయలేదు. హర్షిత్ రాణా తిరిగి జట్టులోకి వచ్చాడు. జట్టు వివరాలను బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ వెల్లడించారు.
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే టీమ్ ఇండియా జట్టు : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (ఫిట్నెస్ నిరూపించుకుంటేనే), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్‌కుమార్ రెడ్డి, కుల్‌దీప్ యాదవ్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, బ్రార్.
ఐర్లాండ్ పర్యటనకు స్క్వాడ్
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్) సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ (వైస్-కెప్టెన్), శివమ్ దూబే, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.
