U19 Asia Cup final| అండర్-19 ఆసియా కప్ ఫైనల్ లో పాక్ చేతిలో భారత్ చిత్తు
అండర్-19 ఆసియా కప్ ఫైనల్ లో దాయాది పాకిస్తాన్ చేతిలో యువ భారత జట్టు 192పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమి పాలైంది. పాకిస్తాన్ జట్టు ఫైనల్ లో ఫెవరేట్ గా దిగిన భారత్ ను చిత్తుగా ఓడించి ఆసియా కప్ విజేతగా నిలిచింది.
విధాత : అండర్-19 ఆసియా కప్ ఫైనల్(U19 Asia Cup final) లో దాయాది పాకిస్తాన్ చేతిలో యువ భారత(India) జట్టు 192పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమి పాలైంది. పాకిస్తాన్ జట్టు ఫైనల్ లో ఫెవరేట్ గా దిగిన భారత్ ను చిత్తుగా ఓడించి ఆసియా కప్ విజేత(Pakistan Asia Cup Win)గా నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా పాకిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పాకిస్తాన్ బ్యాటర్లు అద్బుతంగా రాణించి నిర్ణీత 50ఓవర్లలో 347 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఆ జట్టులో ఓపెనర్ సమీర్ మిన్హాస్ సూపర్ సెంచరీ (172; 113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు)తో భారీ స్కోర్ కు పునాది వేశాడు. అహ్మద్ హుస్సేన్ (56; 72 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. ఉస్మాన్ ఖాన్ (35), ఫర్హాన్ యూసుఫ్ (19), హంజా జహూర్ (18) పరుగులు చేశారు. ఓ దశలో సమీర్ ఔటయిన సమయానికి పాక్ స్కోరు 302/4. చివరి ఏడు ఓవర్లలో పాక్ 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3, హెనిల్ పటేల్ 2, ఖిలాన్ పటేల్ 2, కాన్షిక్ చౌహాన్ ఒక వికెట్ పడగొట్టారు.
348 పరుగుల లక్ష్య ఛేదనలో 26.2 ఓవర్లలోనే 156 పరుగులకు యువ భారత్ జట్టు ఆలౌటైంది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(26, 10బంతుల్లో 1 ఫోర్, 3సిక్స్ లు), బౌలర్ దీపేష్ దేవెంద్రన్ చివర్లో సాధించిన(36, 16బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్స్ లు) పరుగులే భారత్ జట్టులో అత్యధిక స్కోర్ కావడం విశేషం. కెప్టెన్ ఆయూష్ మాత్రే(2) పరుగులకే తొలి వికెట్ గా వెనుతిరుగగా..అప్పటి నుంచి వరుస వికెట్లు కోల్పోయింది. ఆర్యన్ జార్జ్(16), విహాన్ మల్హోత్ర(7), వేదాంత్ త్రివేది(9), అభిజ్నన్ కుందు(13), కనిష్క్ చౌహాన్(9), ఖిలాన్ పటేల్(19), హెనిల్ పటేల్(6), కిషన్ సింగ్(6*) పరుగులు సాధించారు.
పాకిస్తాన్ బౌలర్లలో అలీ రజా 4వికెట్లు, మహ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, హుజఫియా హసన్ లు తలో రెండు వికెట్లు సాధించి భారత పతనాన్ని నిర్దేశించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram