టి20 ప్రపంచకప్‌లో భాగంగా రేపు ఆదివారం జరగబోయే ఇండియా-పాకిస్తాన్ T20 మ్యాచ్ టిక్కెట్ ధర రీసేల్ మార్కెట్లో అక్షరాలా 1,46,49,276.45 ($175,400)కి స్టబ్ హబ్‌లో అమ్మకానికి పెట్టారు. స్టబ్‌హబ్ అనేది సెకండరీ మార్కెట్(Resale Market). ఇక్కడ వినోదం, క్రీడా ఈవెంట్ టిక్కెట్లను చట్టబద్ధంగా బ్లాక్‌లో విక్రయించవచ్చు. ఇది నిజమేనా..? అక్షరాలా నిజం.
న్యూయార్క్: సీట్ నెం.:30, రో నెం.: 20, సెక్షన్ నెం.:252. ఇది రేపు ఇండియా, పాక్‌ల మధ్య జరగబోయే టి20 ప్రపంచకప్ మ్యాచ్ స్టేడియం, ఈస్ట్ మిడోలోని ఒక సీట్. ఈ సీట్ ధరనే స్టబ్ హబ్ రూ.కోటీ నలభై లక్షలని నిర్ణయించింది. ఏంటి దీన్లో ప్రత్యేకత? ఏమో.. అయోమయమేమిటంటే, మళ్లీ ఈ వరుస వెనకున్న 19వ రోలో టికెట్ ధర రూ.58వేలు కాగా, ముందున్న వరుసలోని సీటు 67 వేలుగా ఉంది. స్టబ్ హబ్ అనేది ఒక సెకండరీ మార్కెట్. ఇక్కడ వినోద, క్రీడా సంబంధిత ఈవెంట్ల టికెట్లను చట్టబద్ధంగా బ్లాక్‌లో విక్రయించే వెసులుబాటుంది. మన దగ్గర ఏదైనా టికెట్ ఉంటే ఇటువంటి సైట్లలో మనకు నచ్చిన ధరకు అమ్ముకోవచ్చు. దీన్లోనే మ్యాచ్ టికెట్లు ఆ విధంగా ఎవరో లిస్ట్ చేసారు. అయితే టికెట్‌ను ఆ ధరకు అమ్ముతారని అర్థం కాదు, ఇది విక్రేత కోరుకునే ధర మాత్రమే. కొనాలనుకునేవారు బేరమాడుకోవచ్చు. ఇద్దరికీ ఓకే అయిన ధరకు టికెట్ విక్రయిస్తారు. విచిత్రంగా ఇలాంటి ఇంకో సైట్ వయాగోగో(Viagogo)లో సీటు నెంబరు, ఇతర వివరాలు బహిర్గతం చేయకుండానే అదే ధరకు, బహుశా అదే వ్యక్తి ద్వారా టిక్కెట్‌ను అమ్మకానికి పెట్టారు. భారత్–పాక్ మ్యాచ్ టిక్కెట్లు పొందడం కష్టంగా ఉన్న ఈ సమయంలో, చాలా మంది అమెరికా, కరేబియన్ దీవులలోని అభిమానులు ఎలాగైనా టికెట్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. ఇది రీసేల్ మార్కెట్లకు వరంగా మారింది. శుక్రవారం రాత్రి వరకు, అధికారిక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) సైట్లో కొన్ని టిక్కెట్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. బౌండరీ క్లబ్ విభాగంలో రూ.1,25,000($1,500)లకు, డైమండ్ క్లబ్ విభాగంలో 83 లక్షలకు($10,000) మధ్య ధరలు ఉన్నాయి.
అదే వేదికపై శనివారం నేడు జరిగిన నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ICC సైట్లో ప్రీమియం కోసం రూ.10,000($120) మరియు ప్రీమియం క్లబ్ విభాగాలకు రూ.58వేల($700) మధ్య టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. 34,000 సీట్ల సామర్థ్యం ఉన్న ఈస్ట్ మీడో స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల డిమాండ్ 200 రెట్లు అధికంగా ఉందని ఐసిసి తెలిపింది. ఆన్లైన్లో చాలా ముందుగా టిక్కెట్లు పొందిన వారిలో కొందరు రీసేల్ మార్కెట్లలో భారీగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. Stubhub, Viagogo మరియు అటువంటి సైట్లు టికెట్ విలువ, డిమాండ్ ఆధారంగా విక్రేత మరియు కొనుగోలుదారు నుండి కొంత రుసుము వసూలు చేసి మధ్యవర్తులుగా వ్యవహరిస్తాయి. టికెట్ కోసం $175,400ల డిమాండ్ ఉన్నప్పటికీ, సెకండరీ మార్కెట్లలో అడిగే ధరలు ఎక్కువగా రూ.58వేలు($700) మరియు రూ. 83వేల($1,000) మధ్య ఉన్నాయి, Stubhubలో రెండవ అత్యంత ఖరీదైన లిస్టింగ్ సెక్షన్ 101లో రూ.15 లక్షలు($18,000) కాగా, దాని తర్వాత డైమండ్ విభాగంలో ఒక సీటు రూ. 11 లక్షల 25 వేలు($13, 496)కి వచ్చింది. ఇక్కడ ఉచిత VIP పార్కింగ్ మరియు కాంప్లిమెంటరీ ‘అపరిమిత ఆహారం మరియు పానీయాలు’ (బీర్, వైన్ మరియు మద్యం)వంటి ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయని లిస్టర్ చెప్పారు.
ఏదేమైనా, భారత్‌లోనే అనుకుంటే అమెరికాలో క్రికెట్ పిచ్చి బాగా ఎక్కువవుతోందని తెలుస్తోంది. అయితే డాలర్లలో ఖర్చుపెట్టేవారికి ఇది పెద్ద మొత్తంగా అనిపించకపోవచ్చు. మనం భారత కరెన్సీలో చూసేసరికి కళ్లు తిరుగుతున్నాయి..అంతే.