IPL 2024 SRH vs RR | రాజస్థాన్‌పై హైదరాబాద్ గెలుపు
SRH vs RR ఎట్టకేలకు సన్‌రైజర్స్ మళ్లీ గెలుపు రుచి చూసింది. ముందుగా బ్యాటింగ్‌లో తడబడినా, తర్వాత జూలు విదిల్చి ఫైటింగ్ స్కోర్ చేసిన హైదరాబాద్, టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌ను ఒక్క పరుగు తేడాతో మట్టి కరిపించింది.
ఐపిఎల్–2024లో భాగంగా హైదరాబాద్‌లో జరుగుతున్న 50వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడగా, విజయం సన్‌రైజర్స్‌ను వరించింది. టాస్ గెలిచి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్, పవర్‌ప్లేలో బాగా తడబడింది. 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి దీనస్థితిలో ఉన్న హైదరాబాద్‌ను ట్రావిస్ హెడ్ (44 బంతుల్లో 58), తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (42 బంతుల్లో 76) ఆదుకున్నారు. ముఖ్యంగా నితీశ్ రెచ్చిపోయి సిక్సర్ల మీద సిక్సర్లు దంచి కొట్టాడు. హెడ్ అవుటయిన తర్వాత క్లాసెన్, నితీశ్‌తో జతకలిసి స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. చివరికి సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఒక దశలో 150 పరుగులు కూడా కష్టసాధ్యమనుకున్న హైదరాబాద్ వీరిద్దరి సహకారంతో 200 పరుగుల మార్కును దాటగలిగింది.

రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2, సందీప్ శర్మ ఒక వికెట్ తీసుతకున్నారు.
202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు తొలి ఓవర్లోనే భారీ దెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్‌కు రాజస్థాన్ ఓపెనర్లు, కీలక బ్యాటర్లు బట్లర్ (0), కెప్టెన్ సంజూ(0) ఒక్క పరుగు స్కోరుకే వెనుదిరిగారు. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన రాయల్స్‌ను యశస్వి జైస్వాల్(40 బంతుల్లో 67)), రియాన్ పరాగ్(49 బంతుల్లో 77) అద్భుతమైన పోరాటపటిమ కనబరిచి నిలబెట్టారు. వికెట్లు పడ్డాయన్న బాధేమీలేకుండా వారిద్దరూ యధేచ్చగా షాట్లు కొట్టారు. వీరు మూడో వికెట్‌కు ఏకంగా 134 పరుగుల భాగస్వామ్యం కల్పించి తిరిగి రాజస్థాన్‌ను రేసులోకి తీసుకొచ్చారు.
నరాలు తెగిన చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సినప్పుడు భువనేశ్వర్ బౌలింగ్‌లో రోవ్‌మన్ పావెల్, అశ్విన్ కలిసి 11 పరుగులు చేయగా, ఆఖరి బంతికి 2 పరుగులు కావాల్సివచ్చాయి. ఆ బంతిని సరిగ్గా పావెల్ ప్యాడ్ల మీదకు విసరడంతో గురితప్పిన పావెల్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దాంతో ఒక్క పరుగుతో విజయం హైదరాబాద్ వశమయింది. 20 ఓవర్లలో రాజస్థాన్ సరిగ్గా 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.
హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 3, కమ్మిన్స్ , నటరాజన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram