ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో మిథాల్ నంబ‌ర్ వ‌న్‌

విధాత,దుబాయ్‌: భారత మహిళల జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌.. మూడేండ్ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు అర్ధశతకాలతో అదరగొట్టిన మిథాలీ.. 762 ర్యాంకింగ్‌ పాయింట్స్‌తో నంబర్‌వన్‌ ప్లేస్‌కు చేరింది. లిజెల్లీ లీ (దక్షిణాఫ్రికా), అలీసా హేలీ (ఆస్ట్రేలియా) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకోగా.. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మందన తొమ్మిదో స్థానంలో నిలిచింది. బౌలర్ల జాబితాలో భారత్‌ నుంచి జులన్‌ గోస్వామి (5), పూనమ్‌ […]

ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో మిథాల్ నంబ‌ర్ వ‌న్‌

విధాత,దుబాయ్‌: భారత మహిళల జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌.. మూడేండ్ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు అర్ధశతకాలతో అదరగొట్టిన మిథాలీ.. 762 ర్యాంకింగ్‌ పాయింట్స్‌తో నంబర్‌వన్‌ ప్లేస్‌కు చేరింది. లిజెల్లీ లీ (దక్షిణాఫ్రికా), అలీసా హేలీ (ఆస్ట్రేలియా) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకోగా.. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మందన తొమ్మిదో స్థానంలో నిలిచింది. బౌలర్ల జాబితాలో భారత్‌ నుంచి జులన్‌ గోస్వామి (5), పూనమ్‌ యాదవ్‌ (9) టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు.