South Africa vs India| ముత్తు స్వామి సెంచరీతో దక్షిణాఫ్రికా భారీ స్కోర్

గౌహతి వేదికగా భారత్ తో జరుగుతున్న రెండో క్రికెట్ టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 489పరుగుల భారీ స్కోరు సాధించింది. 247/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు బ్యాటర్ ముత్తుసామి అద్భుత సెంచరీ, మార్కో యన్సెన్ హాఫ్ సెంచరీతో భారీ స్కోర్ చేయగలిగింది.

South Africa vs India| ముత్తు స్వామి సెంచరీతో దక్షిణాఫ్రికా భారీ స్కోర్

విధాత: గౌహతి వేదికగా భారత్ తో జరుగుతున్న రెండో క్రికెట్ టెస్టు(2nd Test Guwahati)లో దక్షిణాఫ్రికా(South Africa vs India) తొలి ఇన్నింగ్స్ లో 489పరుగుల భారీ స్కోరు సాధించింది. 247/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు బ్యాటర్ ముత్తుసామి(Muthusamy century) అద్భుత సెంచరీ, మార్కో యన్సెన్(Marco Jansen 93) హాఫ్ సెంచరీతో భారీ స్కోర్ చేయగలిగింది. ముత్తుస్వామి (109; 206 బంతుల్లో, 10ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్కో యాన్సెన్‌ (93; 91 బంతుల్లో, 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) లతో భారత బౌలర్లను ఆటాడుకున్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 99 బంతుల్లో 94 పరుగులను జత చేశారు. కైల్‌ వెరీన్‌ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన యాన్సెన్‌ దూకుడుగా ఆడాడు. ఫోర్లు, సిక్స్‌లతో భారత్ బౌలర్లపై విరుచకపడ్డాడు. ముత్తస్వామితో కలిసి ఎనిమిదో వికెట్ కు 99పరుగులు జత చేశాడు. ముత్తుస్వామిని సిరాజ్ అవుట్ చేసినప్పటికి యన్సెన్ మాత్రం తన జోరు కొనసాగించి చివరి వికెట్ గా వెనుతిరిగాడు.

అంతకు ముందు ముత్తుసామి, కైల్‌ వేరీన్‌ ఏడో వికెట్‌కు 236 బంతుల్లో 88 పరుగులు జత చేశారు. వీరి భాగస్వామ్యాన్ని రవీంద్ర జడేజా విడదీశాడు. అతడు సంధించిన అద్భుతమైన బంతిని ఆడే క్రమంలో కైల్‌ వెరీన్‌ (45) క్రీజును వదిలి ముందుకు రాగా.. రిషభ్‌పంత్‌ వేగంగా స్పందించి స్టంపౌట్‌ చేశాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (49), కెప్టెన్‌ టెంబా బవుమా (41), కైల్‌ వెరీన్‌ (45), ఐడెన్‌ మార్‌క్రమ్‌ (38), ర్యాన్‌ రికెల్టన్‌ (35), టోనీ డి జోర్జి (28),వియాన్‌ ముల్డర్‌ (13) , హర్మన్ (5), కేశవ మహరాజ్ 12నా టౌట్ పరుగులు సాధించారు. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ 4, రవీంద్ర జడేజా 2, బుమ్రా2, సిరాజ్‌ 2వికెట్లు సాధించారు.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ఇండియా 6 ఓవర్లు మాత్రమే ఆడింది. ఆట ముగిసే సమయానికి భారత్ 9/0 స్కోరుతో నిలిచింది. యశస్వి జైస్వాల్ (7*), కేఎల్ రాహుల్ (2*) క్రీజులో ఉన్నారు.