Palash Muchhal Proposes To Smriti Mandhana : వరల్డ్ కప్ సాధించిన మైదానంలోనే స్మృతికి పలాష్ ప్రపోజల్

వరల్డ్ కప్ సాధించిన డీవై పాటిల్ స్టేడియంలోనే పలాష్ ముచ్చల్, స్మృతి మంధానకు సినిమాటిక్‌గా ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరి ఎంగేజ్‌మెంట్ త్వరలోనే.

Palash Muchhal Proposes To Smriti Mandhana : వరల్డ్ కప్ సాధించిన మైదానంలోనే స్మృతికి పలాష్ ప్రపోజల్

విధాత, ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన భారత ఉమెన్స్ క్రికెట్ జట్టు సభ్యురాలు స్మృతి మంధాన త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. అయితే ఎంగేజ్మెంట్ కు ముందు పలాష్ తన కాబోయే జీవిత భాగస్వామికి సినిమాటిక్ గా చేసిన ప్రపోజల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పలాష్ ఇందుకు సబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. స్మృతి, పలాష్ జంటకు పెళ్లి ప్రపోజల్ వీడియోకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక కావడం విశేషం.

టీమిండియా వరల్డ్ కప్ సాధించిన మైదానంలోనే ప్రపోజల్

టీమిండియా ఉమెన్స్ జట్టు వరల్డ్ కప్ కల సాకారం చేసుకున్ననవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలోకి పలాష్ తన ప్రియురాలు స్మృతిని కళ్లకు గంతలు కట్టి స్టేడియం మధ్యలోకి తీసుకొచ్చాడు. తర్వాతా ఆమెకు ఉన్న గంతలు విప్పగానే..ఎదురుగా పలాష్ మోకాళ్లపై కూర్చొని చేతిలో ఎర్ర గులాబీల బొకే, డైమండ్ రింగ్‌తో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఊహించని ఈ సర్ ప్రైజ్‌తో స్మృతి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం పలాష్ వేలికి ఆమె ఉంగరాన్ని తొడిగారు. చివరికి ఇద్దరూ తమ ఎంగేజ్‌మెంట్ రింగ్స్ చూపిస్తూ కెమెరాకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.