స్వర్ణం గెలిస్తే రూ.6 కోట్లు..యూపీ సీఎం బంఫర్ ఆఫర్
విధాత:ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న తమ రాష్ట్ర అథ్లెట్లకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీ నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు.టోక్యో క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన ప్లేయర్‌కు ఏకంగా రూ.6 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. రజతం కొడితే రూ.4 కోట్లు,కాంస్య పతకధారికి రూ.2 కోట్లు నజరానా అందిస్తామన్నారు. టీమ్ ఈవెంట్లలో పసిడి గెలిచిన ఆటగాడికి రూ. 3 కోట్లు, రజతానికి రూ. 2 కోట్లు, కాంస్యానికి రూ. కోటి చొప్పున ఇస్తామన్నారు.ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత బృందంలో పదిమంది యూపీ […]

విధాత:ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న తమ రాష్ట్ర అథ్లెట్లకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీ నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు.టోక్యో క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన ప్లేయర్‌కు ఏకంగా రూ.6 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. రజతం కొడితే రూ.4 కోట్లు,కాంస్య పతకధారికి రూ.2 కోట్లు నజరానా అందిస్తామన్నారు. టీమ్ ఈవెంట్లలో పసిడి గెలిచిన ఆటగాడికి రూ. 3 కోట్లు, రజతానికి రూ. 2 కోట్లు, కాంస్యానికి రూ. కోటి చొప్పున ఇస్తామన్నారు.ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత బృందంలో పదిమంది యూపీ అథ్లెట్లు ఉన్నారు.