భారత హాకీ క్రీడాకారిణి కుటుంబాన్ని కులం పేరుతో దూషించిన వ్యక్తులపై కఠిన చర్యలు

విధాత:ఒలంపిక్స్‌లో పోరాడి ఓడిన హాకీ మహిళల జట్టులో పాల్గొన్న వందన కటారియా ఇంటి వద్ద అవమానకరంగా డాన్సులు చేసి ఎగతాళి చేసిన దుండగులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని దళిత శోషన్‌ ముక్తి మంచ్‌ జాతీయ కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మొత్తం టీమ్‌లోనే అత్యంత ప్రతిభావంతంగా ఆడిన అమ్మాయి వందన కటారియా. కేవలం దళిత బాలిక అన్న కారణంతో ఆమెను ఓటమికి బాధ్యురాలను చేసి హర్యానాలోని వారి ఇంటి వద్ద అగ్రకుల చాందసవాదులు గొడవ […]

భారత హాకీ క్రీడాకారిణి కుటుంబాన్ని కులం పేరుతో దూషించిన వ్యక్తులపై కఠిన చర్యలు

విధాత:ఒలంపిక్స్‌లో పోరాడి ఓడిన హాకీ మహిళల జట్టులో పాల్గొన్న వందన కటారియా ఇంటి వద్ద అవమానకరంగా డాన్సులు చేసి ఎగతాళి చేసిన దుండగులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని దళిత శోషన్‌ ముక్తి మంచ్‌ జాతీయ కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మొత్తం టీమ్‌లోనే అత్యంత ప్రతిభావంతంగా ఆడిన అమ్మాయి వందన కటారియా. కేవలం దళిత బాలిక అన్న కారణంతో ఆమెను ఓటమికి బాధ్యురాలను చేసి హర్యానాలోని వారి ఇంటి వద్ద అగ్రకుల చాందసవాదులు గొడవ చేయడాన్ని DSMM ఖండిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా నివారించాలని డిమాండ్‌ చేస్తున్నాము.