Team India New Jersy | టీమిండియా టి20 ప్రపంచకప్ జెర్సీని అవిష్కరించిన ఆడిడాస్
రాబోయే టి20 ప్రపంచకప్ సన్నాహాలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా టీమిండియా ధరించబోయే జెర్సీని అధికారిక కిట్ స్పాన్సర్ ఆడిడాస్ ఘనమైన రీతిలో ఆవిష్కరించింది.
టి20 ప్రపంచకప్ కోసం భారత్ ప్రకటించిన 15 మంది జట్టు, ఇంకా నలుగురు బ్యాకప్ ప్లేయర్లలో తుది జట్టులో చోటెవరికో తెలయకపోయినా, అభిమానులు మాత్రం కొత్త జెర్సీ కోసం కన్నులు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ టీమిండియా అధికారిక కిట్ స్పాన్సర్ ఆడిడాస్ వరల్డ్ కప్ జెర్సీని అద్భుతమైన రీతిలో ఆవిష్కరిచింది. దానికి సంబంధించిన విడియోను తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఇదే విడియోను బిసిసిఐ కూడా పోస్ట్ చేసింది.
ఈ విడియోలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కనిపించగా, ధర్మశాల స్టేడియం వేదికైంది. ఒక హెలీకాప్టర్ టీమిండియా జెర్సీని మోసుకుంటూ స్టేడియానికి రావడం, వారు ఆశ్చర్యంగా దాన్ని చూస్తుండటం ఈ విడియోలో కనిపించింది.
మెడ చుట్టూ భారత త్రివర్ణాలు ఒక పట్టీలా ఉండగా, భుజాల మీదుగా చేతులు కాషాయరంగులో ఉన్నాయి. ఇక ముందు, వెనుక భాగాలు భారత క్రికెట్ వర్ణమైన నీలి రంగు పరుచుకునగా, భుజాల మీద ఆడిడాస్ లోగోను గుర్తు చేస్తూ, మూడు తెల్ల రంగు స్ట్రయిప్స్ ఉన్నాయి. ఇది ఆడిడాస్ భారత కిట్ స్పాన్సర్‌గా నియమించబడ్డప్పటి నుండీ జెర్సీ మీద ఉంటున్నాయి. ముందువైపు ఆడిడాస్ ఎంబ్లెంతో పాటు, బిసిసిఐ ఎంబ్లెం కూడా ముద్రించబడి ఉన్నాయి.
కాగా, ఏప్రిల్ 30న భారత్ తన 15 మంది జట్టును టి20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కోలుకున్న భారత డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ జట్టులోకి ఎంపిక కావడం విశేషం.
భారత్ ప్రపంచకప్‌లో ఏ గ్రూప్‌లో ఉండగా, తనతో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, ఐర్లండ్, కెనడాతో పాటు ఆతిథ్య అమెరికా జట్లు ఉన్నాయి. ఇదిలాఉండగా, భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న న్యూయార్క్‌లో ఐర్లండ్‌తో ఆడనుంది. ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 9న జరుగనుంది.
One jersey. One Nation.
Presenting the new Team India T20 jersey.Available in stores and online from 7th may, at 10:00 AM. pic.twitter.com/PkQKweEv95
— adidas (@adidas) May 6, 2024
భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), హార్థిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్‌సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
రిజర్వ్ ఆటగాళ్లు: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.
&nbs
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram