విధాత: భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ ఫైనల్ శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ మైదానంలో ఆదివారం జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయాడు. ఇటీవల తనను ఇది ఐపీఎల్ కాదంటూ అపహాస్యం చేసిన లంకేయులకు తన ధనాధన్ బ్యాటింగ్ తో ధీటైనా సమాధానం చెప్పాడు. తనకు మ్యాచ్ ఏదైనా ఒక్కటేనని తన రికార్డు స్కోర్ తో నిరూపించాడు.
వైభవ సూర్యవంశీ శ్రీలంక బౌలర్లపై సునామీలా విరుచకపడిపోయి..11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు.ముఖ్యంగా తనను లీగ్ మ్యాచ్ లో రెచ్చగొట్టిన లంక బౌలర్ షిరాజ్ వేసిన మూడో ఓవర్లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లుతో 26 పరుగులు కొట్టేశాడు. వైభవ్ సునామీతో 4 ఓవర్లకు ఇండియా ఏ స్కోర్ 76/0 కు చేరింది.
ఆ తర్వాతా కూడా వైభవ తన ధనాధన్ బ్యాటింగ్ కొనసాగించి కేవలం 29 బంతుల్లో(10ఫోర్లు, 8సిక్స్ లు) 324 స్ట్రైక్ రేట్‌తో 94 పరుగులు సాధించి తృటిలో సెంచరీ కోల్పోయాడు. సహన్ బౌలింగ్‌లో 8.5వ బంతికి వియస్కాంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అప్పటికే శ్రీలంకకు తన బ్యాటింగ్ తో చేయాల్సినంత నష్టం చేసి భారత్ భారీ స్కోరుకు బలమైన పునాది వేశాడు.
మరోవైపు ప్రియాంశ్ 39 పరుగులు చేసి దుల్‌జ్ బౌలింగ్‌లో వియస్కాంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకొన్నాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్, రుతురాజ్ ఉన్నారు. భారత్-ఎ 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. టాస్ ఓడిన భారత్ ముందుగా తన బ్యాటింగ్ కొనసాగిస్తుంది. 30ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 229పరుగులు చేసి..భారీ స్కోర్ దిశగా ముందుకెళ్లింది.
లంక ముందు 378 పరుగుల లక్ష్యం
కెప్టెన్ తిలక్ వర్మ (67; 90 బంతుల్లో 4×4, 1×6) అర్ధశతకం, రుతురాజ్ గైక్వాడ్ (40), ప్రియాన్ష్ ఆర్య (39), కుశాగ్ర (36)పరుగులతో రాణించడంతో భారత్ ఏ 50ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 377పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో రవీందు, వనుజా, మథులాన్ తలో 3 వికెట్లు పడగొట్టగా, షిరాజ్, అరాచ్చిగే, సముదిత ఒక్కో వికెట్ తీశారు.
