Vinod Kambli|మాజీ క్రికెటర్ కాంబ్లి పరిస్థితి ఇలా మారిందేంటి.. ఫ్రెండ్‌కి సాయం చేయమని సచిన్‌ని కోరుతున్న నెటిజన్స్
Vinod Kambli| టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దిగ్గజ కోచ్.. రమాకాంత్ అచ్రేకర్ వద్ద కోచింగ్ తీసుకొని మంచి క్రికెటర్‌గా ఎదిగాడు. సచిన్‌తో కలిసి చిన్నప్పటి నుండి క్రికెట్ ఆడాడు కాంబ్లి. సచిన్ టెండూల్కర్ 1989లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో

Vinod Kambli| టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దిగ్గజ కోచ్.. రమాకాంత్ అచ్రేకర్ వద్ద కోచింగ్ తీసుకొని మంచి క్రికెటర్‌గా ఎదిగాడు. సచిన్‌తో కలిసి చిన్నప్పటి నుండి క్రికెట్ ఆడాడు కాంబ్లి. సచిన్ టెండూల్కర్ 1989లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తే.. కాంబ్లి 1991లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాగా, వారు క్రికెట్‌ని ప్రాణంగా ప్రేమిస్తూ వచ్చారు. అయితే సచిన్ ఒక లెజెండ్‌గా ఎదిగితే.. కొన్ని చెడు అలవాట్లతో వినోద్ కాంబ్లి సాధారణ క్రికెటర్‌గా మిగిలిపోయాడు. పాఠశాల స్థాయి క్రికెట్‌లో 1988లో కాంబ్లి- సచిన్ కలిసి ఆడగా, హారిస్ షీల్డ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ జోడి ఏకంగా 664 పరుగుల భాగస్వామ్యం నిర్మించింది.
ఇందులో కాంబ్లి 349 పరుగులు చేయగా , సచిన్ 326 పరుగులు చేశాడు. వారి ఇన్నింగ్స్ ఇప్పటికీ అందరి మదిలో మెదులుతూనే ఉంటుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగిన కొద్దికాలంలోనే తన అద్భుతమైన బ్యాటింగ్ తో అనేక రికార్డులను నెలకొల్పిన కాంబ్లీ ఫామ్ కోల్పోయి కెరీర్‌ను త్వరగానే ముగించారు. ఇక తాజాగా కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో కాంబ్లీ అసలు పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నారు. ఒక్క అడుగు కూడా నడవలేక కిందపడిపోతున్నట్టు చాలా ఇబ్బంది పడ్డారు. అది గమనించిన స్థానికులు అతన్ని పట్టుకొని పక్కకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు.
అయితే తాగి ఉన్నాడని మొదటు అందరు చెప్పుకొచ్చారు. కాని ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని తర్వాత అర్ధమైంది. కాంబ్లి, సచిన్‌లు ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు కావడంతో కాంబ్లీని సచినే ఆదుకోవాలంటూ కొందరు రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలు కాంబ్లీకి ఏమైందని కొందరు ఆరాలు తీస్తున్నారు. కాంబ్లీ వయస్సు కేవలం 52 సంవత్సరాలే. మద్యానికి బానిస కావడం, అనారోగ్య కారణాల వల్లే ఆయన క్రికెట్‌లో క్రియాశీలకంగా ఉండలేకపోయారనే టాక్ కూడా అప్పట్లో వచ్చింది.2013లో వినోద్ కాంబ్లి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇప్పుడు నిల్చోవడానికి ఇబ్బందులు పడే స్థితికి చేరారు. అతని ఆరోగ్యం కుదుట పడాలని అందరు కోరుకుంటున్నారు.
It’s really sad what ALCOHOL can do to you. This is former Indian cricketer Vinod Kambli’s state as he’s escorted off his two wheeler by onlookers to safety. 🥃☠️❌ pic.twitter.com/xxJCQ5lMHC
— #RahulAggarwal (@ImRahulAggarwal) August 6, 2024