Zimbabwe|టీ20లో సరికొత్త రికార్డ్ సృష్టించిన జింబాబ్వే..పెను సంచలనంతో 120 బంతుల్లో 344 పరుగులు
Zimbabwe| టీ 20 చరిత్రలో జింబాబ్వే పెను సంచలనం సృష్టించింది. బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేయడంతో ఏకంగా 120 బంతుల్లో 344 పరుగులు చేసి ప్రత్యర్ధి జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రత్యర్థి జట్టు గాంబియా బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 43 బంతు

Zimbabwe| టీ 20 చరిత్రలో జింబాబ్వే(Zimbabwe) పెను సంచలనం సృష్టించింది. బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేయడంతో ఏకంగా 120 బంతుల్లో 344 పరుగులు చేసి ప్రత్యర్ధి జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా(Sikinder Raja) ప్రత్యర్థి జట్టు గాంబియా బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 43 బంతుల్లో మెరుపు సెంచరీ పూర్తి చేశాడు. ఏడు ఫోర్లు, 15 సిక్సులతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు.బ్రియాన్ బెన్నెట్ (50; 26 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్), మారుమణి (62; 19 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సర్లు), క్లైవ్ మదండే (53; 17 బంతుల్లో, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు.
టీ 20 వరల్డ్ కప్ సబ్ రీజనల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియా జట్టుపై జింబాబ్వే(Zimbabwe) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో జింబావ్వే తరపున టీ 20లో సెంచరీ చేసిన ఫస్ట్ ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఈ మ్యాచ్ ద్వారా జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా రికార్డు సృష్టించాడు. టెస్ట్ హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ (33 బంతుల్లో) చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. దీంతో 35 బంతుల్లో శతకం కొట్టిన రోహిత్ శర్మ(Rohit Sharma), డేవిడ్ మిల్లర్‌ల రికార్డును బద్దలు కొట్టాడు సికిందర్ రాజా. టీ 20లలో ఇప్పటివరకు నేపాల్ పేరు మీద అత్యధిక పరుగుల రికార్డు ఉంది.
2023 సెప్టెంబర్‌లో మంగొలియా జట్టుపై నేపాల్314 రన్స్ చేసి రికార్డు సృష్టించిగా,ఇప్పుడు దానిని తుడిచేసింది జింబాబ్వే జట్టు. ఇక 345 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన గాంబియాను జింబాబ్వే 14.4 ఓవర్లలో కేవలం 54 పరుగులకే ఆలౌట్ చేసింది. తద్వారా 290 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇది అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు అతిపెద్ద విజయం. టీ20లలో ఇతర జట్లు చేసిన భారీ స్కోరు చూస్తే..భారత్ (297/6 వర్సెస్ బంగ్లాదేశ్), అఫ్గానిస్థాన్ (278/3 వర్సెస్ ఐర్లాండ్), చెక్ రిపబ్లిక్ (278/4 వర్సెస్ టర్కీ) ఉన్నాయి.