Northern King Cobra| ఎంత ధైర్యముంటే అంత భారీ కింగ్ కోబ్రాను పట్టాలి?

Northern King Cobra| పాములు జాతులలో అత్యంత ప్రమాదరం..విషపూరితం కింగ్ కోబ్రా(King Cobra). అలాంటి కింగ్ కోబ్రాలలో కొన్ని జాతులు భారీ సైజులో చాల పొడవుగా పెరిగి మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంటాయి. కింగ్ కోబ్రాలలోని నాలుగు జాతులలో అంత్యంత డేంజర్ జాతి(Dangerous Snake) నార్తర్న్ కింగ్ కోబ్రా(Northern King Cobra). దీని శాస్త్రీయ నామం ఓఫియో ఫేగస్ హన్నా. అలాంటి నార్తర్న్ కింగ్ కోబ్రా ఒకటి జనవాసాల్లోకి రావడంతో స్థానికులు స్నేక్ క్యాచర్ (Snake Catcher)కు సమాచారం అందించారు. కింగ్ కోబ్రా ఓ ఇరుకైన సందులో పాకుతుండటంతో దాని వద్దకు నేరుగా ఎదురుగా చేరుకోవాల్సి వచ్చింది. అయినా ఆ స్నేక్ క్యాచర్ ఏ మాత్రం బెదిరిపోకుండా తన వద్ద ఉన్న గోనే సంచికి ఓ పైపు ముక్కను ముందువైపు తగిలించి దానిని కింగ్ కోబ్రా ముందు పెట్టాడు. దానిని చూసిన కింగ్ కోబ్రా తొలుత దానిలో దూరెందుకు నిరాకరిస్తూ స్నేక్ క్యాచర్ పై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది.
అయితే అత్యంత చాకచక్యంతో స్నేక్ క్యాచర్ ధైర్యంగా కింగ్ కోబ్రా ముందుకెళ్లి దాని తల ముందు పైపు భాగాన్ని పెట్టగా..అంది అందులోకి దూరి గోనే సంచిలోకి పోయింది. వెంటనే దానిని అందులో బంధించేసి దానిని దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆసియాలో భారత్ నుంచి దక్షిన చైనా వరకు ఉన్న ఆగ్నేసియా ప్రాంతంలో కనిపించే నార్తర్న్ కింగ్ కోబ్రాలను తెలుగు రాష్ట్రాలలో గిరినాగుగా పిలుస్తుంటారు.