Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

సీట్ల‌లో ఆ అస్థిపంజ‌రాల‌ను చూసి చ‌లించిపోయా.. ప్ర‌త్య‌క్ష సాక్షి హైమారెడ్డి

V Kaveri Travels | వి కావేరి ట్రావెల్స్ బ‌స్సు( V Kaveri Travels Bus ) ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌త్య‌క్ష సాక్షి హైమా రెడ్డి( Hyma Reddy ) తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. క్ష‌ణాల్లోనే బ‌స్సు కాలి బూడిదైంది. సీట్ల‌లో ఆ అస్థిపంజ‌రాల‌ను చూసి చ‌లించిపోయాను అని హైమా రెడ్డి క‌న్నీరు పెట్టుకున్నారు.

అగ్నికీల‌ల‌కు 30 మంది వ‌ర‌కు స‌జీవ‌ద‌హ‌నం.. ప్ర‌త్య‌క్ష సాక్షి క‌థ‌నం ఇదీ..

V Kaveri Travels | ప్ర‌మాదం ఎలా జ‌రిగిందో తెలియ‌దు కానీ.. తాను చూసే స‌రికి బ‌స్సంతా మంట‌లు వ్యాపించాయి. బ‌స్సు ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్ల‌లేని ప‌రిస్థితి. రోడ్డుపై కూడా మంట‌లు విస్త‌రించాయి. దీంతో హెల్ప్ చేసేందుకు కూడా అవ‌కాశం లేదు అని ప్ర‌త్య‌క్ష సాక్షి తెలిపాడు.

ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు.. 20 మందికి పైగా స‌జీవ‌ద‌హ‌నం

Kaveri Travels | క‌ర్నూల్ జిల్లా( Kurnool District )లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. హైద‌రాబాద్( Hyderabad ) నుంచి బెంగ‌ళూరు( Bengaluru ) వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు( Kaveri Travels Bus )లో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో 25 మంది ప్ర‌యాణికుల‌కు పైగా స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు.

అగ్నికీల‌ల‌కు కాలి బూడిదైన బ‌స్సు.. ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డింది వీరే..

Kaveri Travels | హైద‌రాబాద్ న‌గ‌రం నుంచి బెంగ‌ళూరుకు బ‌య‌ల్దేరిన కావేరి ట్రావెల్స్ బ‌స్సు అగ్నిప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో 30 మంది స‌జీవ‌ద‌హ‌న‌మైన‌ట్లు తెలిసింది. మ‌రో 12 మంది ప్రాణాలతో సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.

ప్రపంచకప్​ సెమీఫైనల్లో భారత్​

మందాన‌, రావల్‌ శతకాలతో భారత్‌ భారీ స్కోరు సాధించి, న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రోడ్రిగ్స్‌ దూకుడు, బౌలర్ల అదరహో ప్రదర్శనతో భారత్‌ వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

Harmanpreet Kaur's side registered a comfortable place to become the fourth team to qualify for the semi-finals.

ఔట్‌సోర్సింగ్‌లో బోగస్ ఉద్యోగులు.. అధికారులు, ఏజెన్సీలు నొక్కేసింది 15వేల కోట్లు?

లేని ఉద్యోగులను కంప్యూటర్లలోకి ఎక్కించి, ఉద్యోగం చేయకపోయినా జీతాలు చెల్లించినట్టు రాసి.. పదేళ్ల కాలంలో 15వేల కోట్లు మెక్కేశారన్న ఆరోపణలు తెలంగాణలో సంచలనం రేపుతున్నాయి. దీనిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Committee Meeting On Film Workers Isuue

సినిమా కార్మికుల సమస్యలపై కమిటీ తొలి భేటీ

సినిమా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం లేబర్ కమిషనర్ దాన కిషోర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో దిల్ రాజు, సుప్రియ, దామోదర ప్రసాద్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. కార్మికుల వేతనాలు, పని పరిస్థితులు, సంక్షేమంపై చర్చించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

Kurnool Bus Tragedy

ట్రావెల్స్ బస్సు తొలగింపు చర్యల్లో ప్రమాదం..క్రేన్ బోల్తా

వేమూరి కావేరి బస్సు తొలగింపు చర్యలో క్రేన్ బోల్తా పడింది, ఆపరేటర్‌కు తీవ్ర గాయాలు, పోలీసులు అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.