Alien Spacecraft Attack | దాడి చేసేందుకు వస్తున్న గ్రహాంతర వాసులు..? నవంబర్‌లో యుద్ధమేనా!
గ్రహాంతరవాసులు ఉన్నారో లేదో తెలియదు. ఉంటే.. పీకే సినిమాలో ఆమిర్‌ఖాన్ తరహాలో ఉంటారా? అనే విషయంలోనూ స్పష్టత లేదు. ఏదో చిన్న తల, రెండు పెద్ద కళ్లు.. సన్నటి కాళ్లు.. ఇలా ఏవేవో ఊహాత్మక చిత్రాలు వస్తుంటాయి. అయితే.. తాజాగా రాబోయే నవంబర్ నెల చివరిలో గ్రహాంతరవాసులు భూమిపై దాడి చేసే అవకాశం ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తున్నది.

Alien Spacecraft Attack | ఈ అనంత విశ్వంలో ఎక్కడైనా మనలాంటి భూమి ఉన్నదా? ఉంటే దానిపై జీవం ఉందా? మనలాంటి మనుషులు ఉన్నారా? మనుషులు అనిపి పిలువగలిగిన మనుషులు ఉన్నారా? అనేక ఏండ్ల నుంచి ఈ విషయంలో పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. మన భూమి భాగంగా ఉన్న పాలపుంతల వంటివి ఈ అనంత విశ్వంలో అనేకం ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి అలాంటి ఒకానొక పాలపుంతలోని ఒకానొక భూమిలాంటి గ్రహంపై మనుషులు ఉండి ఉంటారనే అనుమానాలూ ఉన్నాయి. వారిని చేరుకునేందుకు వివిధ దేశాల అంతరిక్ష సంస్థలు అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. వారినే గ్రహాంతరవాసులు అని పిలుస్తున్నారు. ఈ గ్రహాంతర వాసులు భూమికి సమీపంగా వస్తున్నారనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో మరోసారి గ్రహాంతరవాసుల విషయంలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.
తాజాగా శాస్త్రవేత్తలు ఒక భారీ హెచ్చరికే చేశారు. అది.. భూమి దిశగా భారీ అనుమానాస్పద స్పేస్ ఆబ్జెక్ట్ ఒకటి దూసుకొస్తున్నదని తెలిపారు. దాని పరిమాణం అమెరికాలోని మాన్‌హటన్ అంత ఉంటుందని చెబుతున్నారు. అందాజుగా చెప్పాలంటే మన ముంబైనగరం అంత అనుకోవచ్చు. దీనికి ఇదొక గ్రహాంతరవాసుల నౌకగా చెబుతున్నారు. 3I/ATLAS గా పిలుస్తున్న ఈ నౌక ద్వారా గ్రహాంతర వాసులు భూమిపై దాడి చేయడానికి వస్తున్నారన్న అనుమానాలను శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఈ దాడి ఈ ఏడాది నవంబర్ నెలలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ హెచ్చరికలు చేసింది సాదాసీదా వ్యక్తులు కాదు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆస్ట్రోఫిజిసిస్ట్ అవి లోయెబ్. ఈయన గ్రహాంతర వాసుల విషయంలో అనేక పరిశోధనలు చేశారు. భూమికి వెలుపల, సూర్యకుటుంబానికి ఆవల జీవం ఉందా? అనే విషయాన్ని శోధిస్తూ అనేక పత్రాలు సమర్పించారు. ఇది సాధారణ గ్రహశకలంగా కనిపించడం లేదని లోయెబ్ చెబుతున్నారు. ఇది గ్రహాంతర వాసులు పంపినదేనని అనుమానిస్తున్నారు. దాని గతి మార్గం, అది విడుదల చేస్తున్న కాంతి, దానికి తోక వంటిది ఏమీ లేకపోవడం ఇది సహజమైన గ్రహశకలం కాదనేందుకు ఆధారాలని లోయెబ్ చెబుతున్నారు. కచ్చితంగా ఇది గ్రహాంతర వాసులు తయారు చేసినదేనని అంటున్నారు.
అయితే.. ఆయన తాజా అధ్యయనంలో చేసిన హెచ్చరికలపై ఇంకా రివ్యూ జరగాల్సి ఉంది. అనుమానాస్పద ఆబ్జెక్ట్ కక్ష్య అది భూమిని ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా సమీపించే అవకాశాలు ఉన్నాయని ఈ పరిశోధన పేర్కొంటున్నది. ఈ అధ్యయనంలో లోయెబ్‌తోపాటు.. లండన్‌లోని ఇనిషియేటివ్ ఫర్ ఇంటర్‌స్టెల్లర్ స్టడీస్‌కు చెందిన ఆడం హిబ్బెర్డ్, ఆడమ్ క్రౌల్ కూడా పాలుపంచుకున్నారు. నవంబర్ చివరిలో ఈ ఆబ్జెక్ట్ సూర్యునికి సమీపంలోకి వస్తుందని వీరు సూత్రీకరించారు. ఆ సమయంలో అది భూమి దృష్టిని తప్పించుకుంటుందని, తద్వారా అత్యంత వేగంగా భూమివైపు దూసుకొస్తుందని పేర్కొన్నారు.
దీనిని మొదటిసారిగా చిలీలోని రియో హుర్టాడోలో ఉన్న ఆస్టరాయిడ్ టెర్రెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ (ATLAS) సర్వే టెలిస్కోప్ గుర్తించింది. పది నుంచి 20 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ఆబ్జెక్ట్ సెకనుకు 60 కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తున్నదని చెబుతున్నారు.
అయితే.. దీనిని ఊహాజనిత దృక్కోణం నుంచి రూపొందించామని, ఇది తప్పనిసరిగి జరిగి తీరుతుందని లేదని అధ్యయన రచయితలు పేర్కొంటున్నారు. ఈ పత్రం అద్భుతమైదే కానీ.. పూర్తిగా ఊహపైఐ ఆధారపడిందని తెలిపారు. అయినప్పటికీ ఇది విశ్లేషణకు కచ్చితంగా అర్హమైనదని చెబుతున్నారు. ఒకవేళ ఇది నిజమే అయి ఉంటే.. పరిణామాలు భయానకంగా ఉంటాయని పేర్కొంటున్నారు.
Giant Persons | రాక్షసులు నిజంగానే ఈ భూమిపై ఉండేవారా? వారి కథేంటి?
Inostrancevia | డైనోసార్ల కాలంలో భూమిపై నడయాడిన భయానక మృగం.. రూపం చూస్తే గుండె దడ ఖాయం!