పెట్రోల్ కాదు.. హైడ్రోజన్ కాదు.. ఎలక్ట్రిసిటీ అసలే కాదు.. భవిష్యత్తు ఇంధనమేంటో తెలుసా?
పెట్రోలు, డీజిల్ సంగతి వదిలేయండి.. బ్యాటరీ వాహనాలను కూడా పట్టించుకోకండి.. హైడ్రోజన్ ముచ్చట ఎందుకు? రానున్న రోజుల్లో మన వాహనాల్లో ఇంధనంగా ఉండే అవకాశాలు దేనికి ఉన్నాయో తెలిస్తే.. ఆశ్చర్యపోక మానరు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రధానంగా శిలజ ఇంధనాలనే వాహనాలకు వాడుతూ వస్తున్నారు. ధరిత్రిపై కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయాలు కనుగొనేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‌లో వాటి హవా నడుస్తున్నది. మళ్లీ ఈ వాహనాల బ్యాటరీలకు చార్జ్ చేయాలన్నా.. విద్యుత్తే కావాలి. ఆ విద్యుత్తు శిలాజ ఇంధనాలను మండిస్తేనే లభ్యమవుతున్నది. హైడ్రోజన్ వాడకంపైనా ప్రయోగాలు జరిగినా.. అంత సానుకూల ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళ్లగా.. ఒక కొత్త ఆశ చిగురించింది. ఇప్పటి వరకూ ఇంధనంగా ఉపయోగించనిది.. అనూహ్యంగా ముందుకు వచ్చింది. అదే ఆల్కహాల్!
నిజమే.. మీరు విన్నది నిజమే. స్వచ్ఛమైన ఇంధనాల జాబితాలో ఇప్పుడు ఆల్కహాల్‌లోని కీలక విషయం చేరింది. సైంటిస్టులు, ఇంజినీర్లు, వాహనాల తయారీదారులు ఇప్పుడు ఆల్కహాల్ అదేనండి.. అందులోని ఇథనాల్ అద్భుతమైన పరిష్కారమని అంగీకరిస్తున్నారు. దీనిని వినియోగించడం వల్ల కాలుష్యం అదుపులో ఉంటుందని, శిలాజ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్, లేదా.. బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తుతో పని ఉండదని అంటున్నారు. నిజానికి ఇప్పటికే అనేక ఇంజిన్లను మండించడంలో ఇథనాల్ ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. ఇక సరైన వినియోగం స్థానంలోకి కూడా ఇథనాల్ చేరిపోనున్నది.
నిజానికి ఇప్పటికే మనం వాడుతున్న పెట్రోల్, డీజిల్‌లో ఇథనాల్‌ను అంటే బ్లెండ్ చేసిన ఈ10 లేదా ఈ8 రకాన్ని మిక్స్ చేస్తున్నారు. అయితే.. రానున్న రోజుల్లో మొత్తంగా పెట్రోల్ లేదా డీజిల్‌లో ఇథనాల్‌నే తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్రిజల్ వంటి కొన్ని దేశాల్లో ఇంధనం గా కూడా వినియోగిస్తున్నారు. పర్యావరణ హిత యంత్రాల రారాజుగా చెప్పే జాన్ డీరే జర్మనీలో నిర్వహించిన అగ్రిటెక్నికా ట్రేడ్ ఫెయిర్‌లో 9 లీటర్లతో కూడిన, పూర్తిగా ఇథనాల్‌తో పనిచేసే ఇంజిన్‌ను ప్రదర్శనకు పెట్టారు. వాస్తవానికి దీనిని స్ప్పోర్ట్స్ కార్ల కోసం తయారు చేయలేదు.. పంట పొలాల్లో విస్తృతంగా వినియోగించే ట్రాక్టర్లు, మెరైన్ ఇంజిన్లు, పారిశ్రామిక అవసరాల కోసం రూపొందించారు.
వాస్తవానికి రహదారులపై నడిచే కార్ల కంటే.. సుమారు 12 గంటల పాటు ఏకబిగిన పనిచేసే 20 టన్నుల హార్వెస్టర్ వంటి యత్రాలు లిథియం బ్యాటరీ మీద ఆధారపడలేవు. మధ్యమధ్యలో విరామం ఇచ్చి రీచార్జ్ చేయాల్సి వస్తుంది. ఈ ఇబ్బంది లేకుండా జాన్‌డీరే ఈ యంత్రాన్ని తయారు చేశారు. మొక్కజొన్న, చెరుకు వంటి వాటి ద్వారా ఇప్పటికే ఇథనాల్ పెద్ద మొత్తంలో తయారవుతున్నది. క్రయోజెనిక్ ట్యాంకులు లేదా హై ప్రెజర్ హైడ్రోజన్ వ్యవస్థలు దీని రవాణాకు అవసరం లేదు. ఆధునీకరించిన కంబూషన్ ఇంజిన్లలో ఇది పని చేస్తుంది. వాస్తవానికి ఇప్పటికిప్పుడు దీనిని వాడుకునే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. ఇథనాల్ పవర్డ్ యంత్రాలు.. భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానంలో భాగమవుతాయని అంటున్నారు.