Google Chrome | గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక..!
Google Chrome | భారత్‌లో కోట్లాది మంది గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని వినియోగిస్తున్నారు. ఈ జాబితాలో మీరు కూడా ఉంటే.. మీరు పెద్ద ప్రమాదంలో పడినట్లే. ఈ క్రమంలో మీకు కేంద్ర ప్రభుత్వం ఓ హెచ్చరిక జారీ చేసింది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్‌లోని పలు వెర్షన్లలో లోపాలను గుర్తించింది. ఈ క్రమంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

Google Chrome | భారత్‌లో కోట్లాది మంది గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని వినియోగిస్తున్నారు. ఈ జాబితాలో మీరు కూడా ఉంటే.. మీరు పెద్ద ప్రమాదంలో పడినట్లే. ఈ క్రమంలో మీకు కేంద్ర ప్రభుత్వం ఓ హెచ్చరిక జారీ చేసింది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్‌లోని పలు వెర్షన్లలో లోపాలను గుర్తించింది. ఈ క్రమంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. లోపాలతో హ్యాకర్లు డివైజ్‌లను హ్యాక్ చేసి.. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని పేర్కొంది. సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదాలున్నాయని తెలిపింది. డేటాను పొందేందుకు హ్యాకర్లు గూగుల్ క్రోమ్‌లోని లోపాలను అవకాశంగా ఉపయోగించుకోవచ్చని నివేదికలు పేర్కొన్నాయి. గూగుల్ క్రోమ్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో 124.0.6367.78 వెర్షన్ కంటే ముందు, విండోస్, మ్యాక్‌లో క్రోమ్ 124.0.6357.78/.79 కంటే పాత క్రోమ్ వెర్షన్‌లు వినియోగిస్తున్నట్లయితే హ్యాకర్ల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొంది. కంప్యూటర్‌లను సురక్షితంగా ఉంచుకునేందుకు గూగుల్ క్రోమ్ యూజర్లు తప్పనిసరిగా తమ బ్రౌజర్‌ని అప్‌డేట్ చేయాలని సెర్ట్-ఇన్ సూచించింది.
గూగుల్ క్రోమ్ అప్‌డేట్ ఇలా..
- ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి.
- పైన కుడి వైపున మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
- మెనులో హెల్ప్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- ఆ తర్వాత సబ్‌మెనూలోకి వెళ్లి గూగుల్ క్రోమ్‌ని సెలెక్ట్ చేయాలి.
- ఆ తర్వాత గూగుల్ క్రోమ్ అప్‌డేట్స్ ఏవైనా వస్తే తనిఖీ చేసి.. ఇన్‌స్టాల్ చేస్తుంది.
- అప్‌డేట్ పూర్తయిన తర్వాత క్లోజ్ చేసి మళ్లీ ఓపెన్ చేసి వాడుకుంటే సరిపోతుంది.
- స్మార్ట్‌ఫోన్‌లో Google Chromeని ఉపయోగిస్తుంటే.. Google Play Storeకి వెళ్లడం అప్‌డేట్ చేసుకోవాలి.