Robot Olympics China : మనుషులకంటే మేమేం తక్కువా?..రోబోలకు ఒలంపిక్స్ పోటీలు!
చైనాలో తొలిసారి హ్యుమనాయిడ్ రోబో ఒలింపిక్స్బీ. జింగ్‌లో స్ప్రింట్, ఫుట్‌బాల్, మారథాన్ పోటీల్లో ప్రపంచం ఆశ్చర్యం.

Robot Olympics China | విధాత: మనుషులు సృష్టించిన రోబోలు చివరకు మనుషులు సైతం చేయలేని పనులు చేస్తూ..సాంకేతికంగా..భౌతికంగా..మేథో విజ్ఞానపరంగా అధికులం అనిపించుకుంటున్నాయి. తమిళ డైరక్టర్ శంకర్ రోబో సినిమాలో ఇనుములో హృదయం మొలిచిను అంటూ…హీరోయిన్ తో రోబో ప్రేమాయణాన్ని ప్రేక్షకులు వింతగా చూశారు. ఇలాంటి మరో వింత వ్యవహారం ఒకటి వింత చేష్టల దేశం చైనాలో చోటుచేసుకుంది. చైనాలో హ్యుమనాయిడ్ రోబోలకు తొలిసారిగా ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు 16 దేశాలకు చెందిన దాదాపు 280 జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలకు సంబంధించిన వీడియోలు నెట్టింటా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మనుషుల కంటే మేమేం తక్కువంటూ మరమనుషులు బీజింగ్‌లోని ది నేషనల్ స్పీడ్ స్కేటింగ్ ఓవల్‌లో ప్రారంభమైన రోబో ఒలంపిక్స్ లో పోటీ పడుతున్నారు.
అమెరికా, జర్మనీ, బ్రెజిల్, జపాన్ వంటి దేశాల నుంచి 192 విశ్వవిద్యాలయాలు, 88 ప్రైవేటు సంస్థలకు చెందిన రోబోలు ఈ ఒలంపిక్స్ లో పాల్గొంటున్నాయి. చైనా నుంచి యూనిట్రీ, ఫోరియర్ సంస్థలు దీనిలో పోటీ పడుతున్నాయి. తొలుత స్ప్రింట్ రన్నింగ్, సాకర్, బాక్సింగ్ పోటీలు జరిగాయి. రోబోలు ఫుట్‌బాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు, టేబుల్ టెన్నిస్‌తోపాటు.. ఔషధాలను గుర్తించడం, వస్తువులను తీసుకెళ్లడం, క్లీనింగ్ సర్వీసెస్ వంటి విభాగాల్లో పోటీ పడ్డాయి. బీజింగ్ మున్సిపల్ గవర్నమెంట్ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. బీజింగ్ ఆటోమేషన్, ఏఐ లక్ష్యాల ప్రమోషన్ లో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
ఇటీవలే ఏప్రిల్ నెలలో ప్రపంచంలోనే తొలిసారిగా హ్యుమనాయిడ్ రోబోలకు చైనా పరుగు పందెం నిర్వహించింది. వాటి హాఫ్ మారథాన్‌ను విజయవంతంగా నిర్వహించి.. ఔరా అనిపించింది. బీజింగ్ ఈ-టౌన్‌గా పిలువబడే బీజింగ్ ఎకనమిక్ – టెక్నాలాజికల్ డెవల్‌పమెంట్ ఏరియా ఈ పోటీలను నిర్వహించి అందరిని ఆశ్చర్యపరించింది. 21 కిలోమీటర్ల పరుగు పందెం(హాఫ్ మారథాన్)లో 21 హ్యుమనాయిడ్ రోబోలు పోటీ పడి పరుగు తీశాయి. వేర్వేరు విశ్వవిద్యాలయాలు, సంస్థలు అభివృద్ధి చేసిన వివిధ ఆకారాలలోని రోబోలు పోటీలో పాల్గొన్నాయి.
రోబోలను అభివృద్ధి చేసిన సాంకేతిక బృందాల సభ్యులు కూడా తమతమ రోబోలతో కలిసి పరుగుడెతూ అవి గమ్యస్థానాన్ని చేరుకునేలా చేశారు. ఈ హాఫ్ మారథాన్‌లో తియంగాంగ్ జట్టుకు చెందిన తియంగాంగ్ అల్ట్రా రోబో 2 గంటల 40 నిమిషాల్లో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచింది. అయితే ఈ రేసులో పాల్గొన్న పాల్గొన్న చాలా రోబోలు పోటీ పూర్తికాకముందే దెబ్బతిన్న నేపథ్యంలో ఈ ఒలంపిక్స్ ముగిసే సరికి ఎన్ని రోబోలు గాయాలపాలై రీపేర్లకు గురవుతాయోనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…
కోబ్రాలందు కొన్ని కోబ్రాలు వేరయా! కాటేస్తే.. కాటికే!
డిజిటల్ సైలెన్స్ : మానసిక ప్రశాంతతకు మార్గం