Tech tips | మీ ఫోన్‌ తరచూ హ్యాంగవుతోందా.. అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..!

Tech Tips ‌: స్మార్ట్‌ ఫోన్‌లు ఎంతో ఇష్టపడి తీసుకుంటాం. ఏ ఫోన్‌ బాగుంది అని బాగా శోధించి కొంటాం. అయితే ఒక్కోసారి ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్‌ ఆగిపోతుంది. ఎవరికైనా అత్యవసరంగా మెసేజ్‌ పంపాలనుకున్నప్పుడు హ్యాంగవుతుంది. తరచూ ఇలాగే జరుగుతుంటే చిరాకుగా అనిపిస్తుంది. మైండ్‌ డిస్టర్బ్‌ అవుతుంది. మరి మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా..? మీ ఫోన్‌ కూడా హ్యాంగ్‌ అవుతోందా..? అయితే ఈ టిప్స్‌ ట్రై చేయండి..

స్టోరేజీని డిలీట్‌ చేయండి 

మీకు తెలియకుండానే ఫోన్‌లో స్టోరేజీ ఫుల్‌ అయిపోతుంటుంది. సామర్థ్యానికి చేరువగా స్టోరేజీ వస్తే ఫోన్‌ నెమ్మదించడం, హ్యాంగవడం సహజం. కాబట్టి వెంటనే మీ ఫోన్‌ నుంచి అనవసరపు సందేశాలు, వీడియోలు, ఫొటోలను డిలీట్‌ చేయండి.

అనవసర యాప్స్‌ తీసేయండి 

అవసరం అంటూ కొన్ని యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. అవసరం తీరాక వాటిని తొలగించడం మర్చిపోతుంటాం. ఇలా మనకు తెలియకుండానే ఫోన్‌లో వాడని యాప్స్‌ పెరిగిపోతుంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే అన్‌ ఇన్‌స్టాల్‌ చేయండి.

క్యాచీ క్లియర్‌ చేయండి

కొన్ని సార్లు అధిక క్యాచీ కారణంగా మొబైల్‌ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొదట దాన్ని తొలగించండి. అందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజ్‌ ఆప్షన్‌ ఎంచుకోండి. అనంతరం యాప్స్‌లోకి వెళ్లి సంబంధిత యాప్‌ను సెలక్ట్‌ చేయగానే క్లియర్‌ క్యాచీ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే సరి. క్యాచీ క్లియర్ అవుతుంది.

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయండి

తరచూ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయడం చాలా ముఖ్యం. దాంతో ఫోన్‌లో సరికొత్త ఫీచర్లు వచ్చి చేరుతుంటాయి. ఫోన్‌ వేగం పెరుగుతుంది. దీంతో పాటు హోం స్క్రీన్‌పై ఉండే విడ్జెట్స్‌లను తొలగించండి. ఇవి కూడా ఫోన్‌ హ్యాంగ్‌ అవ్వడానికి ఓ కారణం.

వైరస్‌ను తొలగించండి

వైరస్‌ డిటెక్టింగ్‌ యాప్‌ ఫోన్‌కు రక్షణ అందిస్తుంది. దీన్ని ఇన్‌స్టాల్‌ చేస్తే ఫోన్‌లో ఏదైనా సాఫ్ట్‌వేర్‌ వైరస్‌ వచ్చి చేరితే వెంటనే కనిపెట్టి మీకు సమాచారం అందిస్తుంది. దాంతో మీరు వైరస్‌ను డిలీట్‌ చేసే అవకాశం కలుగుతుంది.

ఫోన్‌ను రీస్టార్ట్‌ చేయండి

ఫోన్‌ హ్యాంగ్‌ అవుతున్నప్పుడు దాన్ని రీస్టార్ట్‌ చేయాలి. ఇలా రీస్టార్ట్‌ చేయడం ద్వారా ఫోన్‌లోని అప్లికేషన్స్‌ రీసెట్‌ అవుతాయి. దాంతో ఫోన్‌ తిరిగి సరిగ్గా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

Health tips | మీలో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నదా.. అయితే ఈ పండ్లు తప్పక తినండి..!

Health tips | వర్షాకాలంలో వీటిని తప్పక తీసుకోవాలి.. అస్సలు మిస్‌ చేయొద్దు..!

Health tips | మహిళలూ ఆ శుభ్రతపై అశ్రద్ధ అస్సలే వద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం..!

Health tips | తరచూ అవకాడో తింటే మధుమేహం మాత్రమే కాదు.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్‌..!

Health tips | షుగర్‌ రోగులు తరచూ ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట..!