Samsung Tri-Fold Phone | సామ్‌సంగ్ ట్రై-ఫోల్డ్ ఫోన్ సిద్ధం..!

Samsung Tri-Fold Phone | దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ మరో సంచలన ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రోటోటైప్‌ల రూపంలో ప్రదర్శించిన ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ (మూడుసార్లు మడిచే మొబైల్)ను ఎట్టకేలకు ఈ జులై 9న జరగనున్న Galaxy Unpacked ఈవెంట్‌లో ఆవిష్కరించనున్నట్లు సమాచారం.

Samsung Tri-Fold Phone | సామ్‌సంగ్ ట్రై-ఫోల్డ్ ఫోన్ సిద్ధం..!

• జులై 9న Z ఫోల్డ్ 7, ఫ్లిప్ 7తో పాటు పరిచయం

Samsung Tri-Fold Phone | సియోల్, జూన్ 28 (టెక్నాలజీ డెస్క్):దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ మరో సంచలన ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రోటోటైప్‌ల రూపంలో ప్రదర్శించిన ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ (మూడుసార్లు మడిచే మొబైల్)ను ఎట్టకేలకు ఈ జులై 9న జరగనున్న Galaxy Unpacked ఈవెంట్‌లో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఇదే కార్యక్రమంలో గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7, గెలాక్సీ వాచ్ 8 సిరీస్‌లను కూడా విడుదల చేయనున్నారు.

ఇన్‌స్టంట్ డిజటల్ అనే వీబో యూజర్ తెలిపిన సమాచారం ప్రకారం, జులైలో ప్రదర్శించబడే ఈ Galaxy G Fold (ట్రై-ఫోల్డ్ ఫోన్) అక్టోబర్‌లో మాత్రమే వినియోగదారులకు లభ్యం కానుంది. చైనాలో ఇటీవల విడుదలైన Huawei Mate XT Ultimate తరహాలో ఇదీ ట్రై-ఫోల్డింగ్ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చే రెండవ ప్రధాన మోడల్ అవుతుంది.అధికారికంగా ధరకేనా స్పష్టత లేదు కానీ, తాజా లీక్ ప్రకారం ఈ ట్రై-ఫోల్డ్ ఫోన్ ధర $3,000 (భారత రూపాయలలో సుమారు రూ. 2.56 లక్షలు) ఉండే అవకాశముంది.ఫోన్‌లో సిలికాన్-కార్బన్ బ్యాటరీ, అధునాతన ఫ్లెక్స్ G డిజైన్, మరియు మల్టీ-ఆంగిల్ మోడ్యులర్ ఫోల్డింగ్ ప్యానెల్స్ ఉండొచ్చని ఊహిస్తున్నారు.

ఇతర ఉత్పత్తులు కూడా అదే వేదికపై

• Galaxy Z Fold 7
• Galaxy Z Flip 7
• Galaxy Watch 8 సిరీస్
• Android XR హెడ్సెట్ (కోడ్ నేమ్: Project Moohan)
• సామ్‌సంగ్ AR గ్లాసెస్ ప్రివ్యూలు కూడా ఉండే అవకాశం
వినూత్న డిజైన్ – భవిష్యత్ ఫోల్డబుల్స్‌కుమార్గదర్శి?
ఇప్పటికే సామ్‌సంగ్ Flex Slidable, Flex S, Flex G వంటి ఫోల్డబుల్ ప్రోటోటైప్‌లను టెక్ షోలులో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ ట్రై-ఫోల్డ్ ఫోన్‌తోపాటు సామ్‌సంగ్ తీవ్రమైన మల్టీ-ఫోల్డ్ మార్కెట్ పోటీలోకి దిగుతోంది.

సంక్షిప్తంగా…

• Galaxy G Fold (ట్రై-ఫోల్డ్) ఫోన్ జులై 9న పరిచయం
• అక్టోబర్‌లో లాంచ్
• $3,000 ధర అంచనా
• Huawei కి పోటీగా సామ్‌సంగ్ విప్లవాత్మక దూకుడు
• వాచ్‌లు, ఫోల్డబుల్స్‌తోపాటు XR, AR పరికరాల ప్రివ్యూలు కూడా ఆశించవచ్చు