నేడు రేపు తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు..ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
తెలంగాణ, ఏపీ రాష్ట్రాలపై వర్షం భీభత్సం సృష్టించింది. గ్రామాలు, పట్టణాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాల వల్ల తెలంగాణ లో 18 మంది మృతి చెందారు

- వర్షభీభత్సం
- నేడు రేపు అత్యంత భారీ వర్షాలు
- 18 మంది మృతి
- 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం
- 40 రైళ్లు రద్దు- మరో 40 రైళ్లు దారి మల్లింపు
- హైదరాబాద్-విజయవాడ రహదారి మూసివేత
- తెలంగాణలో 117 గ్రామాలకు రాకపోకలు బంద్
- జలదిగ్భందంలో ఖమ్మం, విజయవాడ
- కృష్ణమ్మకు పోటెత్తిన వరద
తెలంగాణ, ఏపీ రాష్ట్రాలపై వర్షం భీభత్సం సృష్టించింది. గ్రామాలు, పట్టణాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాల వల్ల తెలంగాణ లో 18 మంది మృతి చెందారు. 117 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మహబూబాబాద్ లో రాళ్ల వాగు ఉప్పొంగింది. వరద ఉదృతికి డీసీఎం కొట్టుకు పోయింది.
కృష్ణా, గోదావరి నగదులకు వరద పోటెత్తింది. మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చడంతో ఖమ్మం పట్టణం జలదిగ్భందం అయింది. ఖమ్మం పట్టణానికి బయటి ప్రపంచంతో సంబందాలు కట్ అయ్యాయి. విజయవాడ నగరంలోకి వరద నీరు చేరింది. అనేక కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. ఇంద్రకిలాద్రికి రాకపోకలు బంద్ చేశారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని మూసి వేశారు.విజయవాడ, గుంటూరు వెళ్లే వాహనాలను నల్లగొండ, మిర్యాల గూడ మీదుగా దారి మల్లించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సమీపంలో వరద నీటికి పట్టాలు రైలు పట్టాలు కొట్టుకు పోయాయి. దీంతో ఈ రూటులో నడిచే 40 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరో 40 రైళ్లను దారి మల్లించింది.
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ మహా నగంలో అనేక కాలనీలు, బస్తీలు జలమయం అయ్యాయి. హుస్సేన్ సాగర్‌కు వరద పోటెత్తింది. దీంతో ఒక గేటు ఎత్తి అశోక్ నగర్ నాలాలోకి వరద నీటిని వదిలారు, ప్రభుత్వం సిబ్బంది, అధికారులకు సెలవులు రద్దు చేసింది. అందరూ విధుల్లో ఉండాలని ఆదేశించింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. శ్రీశైలం ఘాట్ రోడ్‌లో కొండచరియలు విరిగి పడడంతో మన్ననూర్ చెక్ పోస్ట్‌ను మూసి వేశారు. భక్తులు ఎవ్వరూ శ్రశైలం వైపు రావద్దని విజ్ఙప్తి చేశారు.
తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం
భారీ వర్షాలతో దాదాపు 10 లక్షల ఎకరాల పంట నీటి మునిగి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పత్తి, మిరప, వరి పంటలు నీటి మునిగాయి. ఎక్కువగా ఖమ్మం, సూర్యాపేట మహబూబాబాద్, నల్లగొండ జిల్లాల్లో పంట నష్టం జ రిగినట్లు అధికారులు గుర్తించారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 4.08 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ లో 2.84 లక్షల ఎకరాలు, సూర్యాపేటలో 3.32 లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసిట్లు సమాచారం. మిగతా జిల్లాల్లో కూడా భారీ ఎత్తున పంట నష్టం జరిగిందని అంటున్నారు.అయితే వర్షాలు తగ్గు ముఖం పట్టిన తరువాత అధికారులకు పంట నష్టం లెక్కలు వేయనున్నట్లు సమాచారం. 4 లక్షల ఎకరాల్లో పత్తి పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణకు భారీ వర్ష సూచన..
గడిచిన 24 గంటల్లో కామారెడ్డి పట్టణ కేంద్రంలో 25 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. కాగా సోమవారం నాడు అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. అలాగే అతి భారీ వర్షాలు జగిత్యాల,రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురుస్తాయని, మిగతా జిల్లాల్లోసాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల పాలు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకశం ఉందని హైదరాబాద్ వాతావణ కేంద్రం హెచ్చరించింది. వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు. ఖమ్మం వరద నీటిలో చిక్కుకున్న రాజీవ్ గృహకల్ప కాలనీని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం చేపట్టారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాలలో పర్యటించనున్నారు.