Nagarjuna Sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 22 గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలాశయానికిఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాగర్ ప్రాజెక్టు 22 క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.

Nagarjuna Sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 22 గేట్లు ఎత్తివేత

అవుట్ ఫ్లో 1లక్ష 47వేల క్యూసెక్కులు దిగువకు
ఇన్ ఫ్లో 3లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

విధాత, హైదరాబాద్ : నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలాశయానికిఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాగర్ ప్రాజెక్టు 22 క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం పూర్తి మట్టం 312టీఎంసీలకుగాను 298టీఎంసీలకు చేరుకోగా,590అడుగులకు 585అడుగులుగా ఉంది. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు 10గేట్లు 12ఫీట్ల మేరకు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.

సాగర్ జలాశయానికి 3లక్షల ఇన్‌ఫ్లో వరద వస్తుంది. దీంతో సాగర్ ప్రాజెక్టు 22గేగట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. దిగువన పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.77టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.25టీఎంసీలకు చేరగా, సాగర్ నుంచి విడుదలవుతున్న నీటితో పులిచింతల జలాశయం వేగంగా నిండుతుంది. పులిచింతల నిండితే దిగువ విడుదల చేసే నీరు ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి చేరనుంది.

 

సాగర్ లో లెవల్ కాలువకు గండి.. నీటి విడుదల నిలిపివేత

నాగార్జున సాగర్ లో లెవల్ వరద కాలువకు గండి పడింది. అనుముల(హాలియా) మండలం మారేపల్లి వద్ద గండి పడటంతో నీరు వృధాగా పోతుంది. దీంతో అధికారులు నీటి విడుదల నిలిపివేశారు. ఈనెల 2న జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఈ కాలువకు నీటి విడుదల చేశారు. ఇంతలోనే గండి పడటంతో కాలువ నిర్వాహణ తీరు పట్ల అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.