బంజారాహిల్స్‌లో 3.35కోట్ల నగటు పట్టివేత

విధాత : ఎన్నికల నేపధ్యంలో ముమ్మరం చేసిన తనిఖీల్లో భాగంగా బంజారాహిల్స్‌లో మంగళవారం 3.35కోట్ల హవాలా నగదును పోలీసులు పట్టుకున్నారు. ద. వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డెవిస్ వివరాలు వెల్లడించారు. పట్టుబడిన నగదు హవాల సొమ్ముగా గుర్తించామని, నలుగురు ఏపీకి చెందిన వ్యక్తులని.. రూ.కోటికి రూ.25వేల కమిషన్ తీసుకుంటున్నారని డీసీపీ వివరించారు. హవాలా వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.
ఎన్నికల కోడ్ ప్రకారం రూ.50వేలకుపైగా డబ్బులను తీసుకువెళ్లే తప్పనిసరిగా నగదుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్న తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, నగలు, ఎన్నికలలో పంపిణీకి సిద్ధం చేసిన కానుకలు పట్టుబడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ధ వాహన తనిఖీల్లో 6.55లక్షల నగదును పట్టుకున్నారు. విచారణ నిమిత్తం నగదును అక్కడి ఆర్డీవోకు అప్పగించారు. సోమవారం హైదరాబాద్ ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఏడు కిలోలకుపైగా బంగారం, మూడు కిలోలకుపైగా వెండి.. కోట్లల్లో నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.