తీవ్ర విషాదం మిగిల్చిన రోడ్డు ప్రమాదం
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

విధాత, హైదరాబాద్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో ఏడు నెలల గర్భిణితో పాటు ఆమె కడుపులో ఉన్న శిశువు మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం మిర్దొడ్డి మండలానికి చెందిన దంపతులు మనోహరాబాద్ నుంచి దండుపల్లికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. జాతీయ రహదారిని క్రాస్ చేస్తుండగా తూప్రాన్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో దంపతులిద్దరూ కిందపడిపోయారు. మహిళతో పాటు ఆమె గర్భంలోని ఏడు నెలల శిశువు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.